ఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్రస్థాయి పాఠశాలల అండర్–17 అథ్లెటిక్స్ పోటీలు ఖమ్మంలోని పోలీస్ పరేడ్ మైదానంలో బుధవారం ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా డీఈఓ వాసంతి క్రీడా పతాకాన్ని ఎగురవేశారు. తొలిరోజు 1,500 మీటర్ల పరుగు పందెం పోటీ నిర్వహించగా.. బాలుర విభాగం నుంచి ఎం.గణేష్(నల్లగొండ) ఎం.చరణ్ తేజ(ఆదిలాబాద్), వి.గణేష్(రంగారెడ్డి), బాలికల విభాగంలో ఎం.డీ.ఆస్మిన్(కరీంనగర్), ఎం.రాజేశ్వరి(ఆదిలాబాద్), పి.నక్షత్ర(రంగారెడ్డి) మొదటి మూడు స్థానాలు కై వసం చేసుకున్నారు. ఈ పోటీలు గురువారం కూడా కొనసాగనున్నాయి.


