మిర్యాలగూడ : దామరచర్ల మండలం వీర్లపాలెం శివారులోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) పనులను జెన్కో సీఎండీ ఎస్.హరీష్ బుధవారం పరిశీలించారు. అధికారులతో సమీక్ష నిర్వహించి కోల్ హ్యాడ్లింగ్ ప్లాంట్‌కి సంబంధించిన అంశాలపై చర్చించారు. కోల్ హ్యాడ్లింగ్ ప్లాంట్‌లోని వ్యాగన్ టిప్పర్లు, క్రషర్ హౌస్ ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఆయన వెంట బీహెచ్ఈఎల్ డైరెక్టర్ తజీందర్గుప్తాతో పాటు జెన్కో, బీహెచ్ఈఎల్ అధికారులు వై.రాజశేఖర్‌రెడ్డి, బి.లక్ష్మయ్య, బికాశ్ మిశ్రా, జె.సూర్యనారాయణ తదితరులు ఉన్నారు.


