విద్యుదాఘాతంతో భవన నిర్మాణ కార్మికుడు మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో భవన నిర్మాణ కార్మికుడు మృతి

Nov 5 2026 1:34 AM | Updated on Nov 5 2026 1:34 AM

ఫ మరొకరికి తీవ్ర గాయాలు

మిర్యాలగూడ అర్బన్‌: నూతనంగా నిర్మిస్తున్న ఇంటికి స్లాబ్‌ వేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ భవన నిర్మాణ కార్మికుడు మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మిర్యాలగూడ పట్టణంలో బుధవారం జరిగింది. వన్‌టౌన్‌ సీఐ నాగభూషణరావు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిపురారం మండలం నీలాయిగూడెం గ్రామానికి చెందిన వేముల కృష్ణ(38), మిర్యాలగూడ పట్టణంలోని సుందర్‌నగర్‌కు చెందిన గుంజ రాము, మరికొందరు కూలీలు కలిసి మిర్యాలగూడ పట్టణంలోని చింతపల్లి ఇందిరమ్మ కాలనీలో భవన నిర్మాణ పనులకు వెళ్లారు. భవనం స్లాబ్‌ వేస్తుండగా.. విద్యుత్‌ తీగ నుంచి ఇనుప చువ్వకు కరెంట్‌ సరఫరా జరిగి నలుగురు కూలీలు విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ఘటనలో వేముల కృష్ణ అక్కడికక్కడే మృతిచెందగా.. గుంజ రాముకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు రామును ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement