మాగేస్తే.. ఎండుగడ్డిలోనూ పోషకాలు లభ్యం | - | Sakshi
Sakshi News home page

మాగేస్తే.. ఎండుగడ్డిలోనూ పోషకాలు లభ్యం

Nov 5 2026 1:34 AM | Updated on Nov 5 2026 1:34 AM

గుర్రంపోడు : ఎల్‌నినో వల్ల ఖరీఫ్‌ వరి సాగు తగ్గడంతో పచ్చి పశుగ్రాసం కొరత కారణంగా పలువురు రైతులు ఎండుగడ్డిపై ఆధారపడుతున్నారు. ఎండిన వరి గడ్డిలో పచ్చిమేతలో ఉండే పోషకాలు ఉండకపోవడంతో పశువులు బక్కచిక్కిపోతున్నాయి. పలు మెళకువలు పాటిస్తే ఎండిన వరి గడ్డిలో పోషకాలు పెరిగి పచ్చిమేతగా మారుతుంది. ఎండుగడ్డిని పోషక విలువలున్న గ్రాసంగా మార్చుకునే విధానాన్ని గుర్రంపోడు మండల పశువైద్యాధికారి సాయిరాం వివరించారు. సాధారణంగా వేసవిలో పచ్చిగడ్డి కొరత కారణంగా ఎండు గడ్డిని రైతులు ఎక్కువగా పశువులకు అందిస్తుంటారు. ఎండు గడ్డితోపాటు జొన్న, మొక్కజొన్న, చొప్పను కూడా ఎండబెట్టి పశువులకు మేతకు వినియోగిస్తారు. వరి కోతల అనంతరం రైతులు ఎండు గడ్డిని నిల్వ చేసి పశువులకు వేస్తారు. వాటికి కావాల్సిన మాంసకృత్తులు, ఖనిజ లవణాలు, విటమిన్లు ఎండు గడ్డిలో లభించవు. జీర్ణం కాని పీచు పదార్థర్ధమే ఎండు వరి గడ్డిలో అధికంగా ఉంటుంది. అయితే ఎండు గడ్డిలో నాణ్యతను పెంచుకుని పశువులకు ఆహారంగా వినియోగిస్తే అన్ని కాలాల్లో పచ్చిమేతగా ఉపయోగించవచ్చు.

వరి గడ్డిని మాగేయడం ఇలా ..

పచ్చిమేత కొరత ఉన్న కాలంలో ఎండు గడ్డిని యూరియా ద్రావణంలో ఊరేస్తే ఈ మేతలో పోషక విలువలు పెరుగుతాయి. 60 లీటర్ల నీటిలో నాలుగు కిలోల యూరియాను కరిగించాలి. 100 కిలోల వరిగడ్డిని పొరలు, పొరలుగా వేస్తూ ప్రతి పొరపై నీళ్లు చిలకరించాలి. పొరల మధ్య గాలి ప్రవేశించకుండా తొక్కాలి. పెద్ద మొత్తంలో యూరియా గడ్డి తయారీకి వాము వేసి టార్పాలిన్‌ను కప్పాలి. 10 రోజలు తర్వాత తీసిచూస్తే, అమ్మోనియా వాసన కలిగి గోధుమరంగుకు మారిన మాగేసిన వరిగడ్డి పశువులు తినడానికి సిద్ధంగా ఉంటుంది.

ప్రయోజనాలు

యూరియా ద్రావణంలో మాగవేసిన వరి గడ్డిని వాడటం వల్ల గడ్డి నాణ్యత పచ్చి గడ్డిమేతతో సమానంగా ఉంటుంది. జీర్ణమయ్యే మాంసకృత్తులు లేని వరి గడ్డిలో మాగేయడం ద్వారా నాలుగు శాతం మాంసకృత్తులు లభ్యమవుతాయి. యూరియా గడ్డి గోధుమ రంగులో ఉండి, అమ్మోనియా వాసన కలిగి, రుచికి తీయగా, మెత్తగా ఉండటం వల్ల పశువులు ఇష్టంగా తింటాయి. గడ్డిలోని పోషక పదార్ధాలు మూడు నెలల వరకు నిల్వ ఉంటాయి. వరి గడ్డిలో జీర్ణంకాని సెల్యులోజ్‌, హెమి సెల్యులోజ్‌ పీచుపదార్ధాలు ఊరవేసిన తర్వాత సులభంగా జీర్ణమవుతాయి.

ఫ పాడి పశువులకు ఎంతో మేలు

ఫ గుర్రంపోడు పశువైద్యాధికారి

సాయిరాం సూచనలు

జాగ్రత్తలు

పశువులు యూరియాను గాని, యూరియా నీళ్లనుగాని తాగకుండా జాగ్రత్తపడాలి. పొరల మధ్య గాలి ప్రవేశించకుండా తొక్కడం, తాళ్లతో బంధించడం చేయాలి. తమకున్న పశువుల సంఖ్య ఆధారంగా 3 మాసాలకు సరిపోయే వరిగడ్డిని మాగవేసుకుని, ఒక వాము వాడటం ప్రారంభించగానే మరొకటి తయారు చేసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement