శాలిగౌరారం: శాలిగౌరారం పీహెచ్‌సీ(ప్రాథమిక ఆరోగ్య కేంద్రం) సంచలనాలకు నిలయంగా మారింది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో ఎలాంటి సంచలనం జరిగినా శాలిగౌరారం పీహెచ్‌సీకి లింకు ఉండటం గమనార్హం. శాలిగౌరారం పీహెచ్‌సీ పరిధిలో ఆరునెలల వ్యవధిలో రెండు సంచలన సంఘటనలు జరిగాయి. అందులో ఏప్రిల్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ పేరుతో పీహెచ్‌సీకి చెందిన స్టాప్‌నర్స్‌గా పనిచేసిన రమాకుమారి, కాంట్రాక్ట్ పద్ధతిలో రెండవ ఏఎన్‌ఎంగా పనిచేసిన సుప్రియ అక్రమాలకు పాల్పడటంతో కేసులు నమోదయ్యాయి. స్టాప్‌నర్స్ రమాకుమారిని సస్పెండ్ చేయగా, కాంట్రాక్ట్ పద్ధతిలో రెండవ ఏఎన్‌ఎంగా ఉన్న సుప్రియను విధులనుంచి పూర్తిగా తొలగిస్తూ (టర్మినేషన్ చేస్తూ) జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో శాలిగౌరారం పీహెచ్‌సీ అప్పట్లో ఈ అవినీతి కేసు విషయంలో సంచలనంగా మారింది.
ఇప్పుడు మరో కేసు..
నకిరేకల్ మండలం ఓగోడు గ్రామానికి చెందిన చామకూరి వెంకటేశ్వర్లు శాలిగౌరారం పీహెచ్‌సీలో కాంట్రాక్ట్ పద్ధతిలో హెల్త్ అసిస్టెంట్‌గా 2007 అక్టోబర్‌లో విధుల్లో చేరాడు. అప్పటి నుంచి మండలంలోని మాధారంకలాన్ సబ్‌సెంటర్ హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ వచ్చాడు. ప్రభుత్వం 2023 నవంబర్ 26న కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లను రెగ్యులరైజ్ చేయడంతో డిప్యూటేషన్‌పై నకిరేకల్ మండలం ఓగోడు పీహెచ్‌సీకి వెళ్లాడు. అక్కడ విధులు నిర్వర్తిస్తూ 2025 మే 31న పదవీ విరమణ పొందాడు. అనంతరం ఇంటివద్ద ఉంటున్న వెంకటేశ్వర్లు అనారోగ్యానికి గురై సూర్యాపేటలో చికిత్స పొందుతూ 2025 నవంబర్ 17న మృతిచెందాడు. వెంకటేశ్వర్లు ఉద్యోగం పొందాలనే దురాశతో మృతుని కుటింభీకులు విధి నిర్వాహణలో ఉన్నప్పుడే మృతిచెందినట్లు తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రాన్ని పొందడంతోపాటూ సంబంధిత అనుబంధ పత్రాలను పొందారు. తండ్రి ఉద్యోగానికి సంబంధించిన ఒరిజనల్ ప్లేస్(ప్రాంతం) అయిన శాలిగౌరారం పీహెచ్‌సీ నుంచి సంబంధిత ఫైల్‌ను జిల్లా కార్యాలయానికి పంపించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయానికి చెందిన ఇద్దరు ఉద్యోగుల సూచనల మేరకే శాలిగౌరారం పీహెచ్‌సీలో ఇద్దరు కీలక ఉద్యోగులు ఫైల్‌కు సంబంధించిన పూర్తి సహకారాలు అందించారనే ప్రచారం జోరుగా సాగుతోంది. వెంకటేశ్వర్లు కుమారుడికి దామరచర్ల పీహెచ్‌సీలో అటెండర్‌గా ఉద్యోగ అవకాశం కల్పించారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగం పొందిన విషయం బట్టబయలు కావడం ప్రస్తుతం ఈ సంచలనానికి కూడా శాలిగౌరారం పీహెచ్‌సీనే కేంద్రబిందువు కావడం గమనార్హం.
ఫ గతంలో క్రమబద్ధీకరణ వ్యవహారంలో స్టాఫ్ నర్స్, సెకండ్ ఏఎన్‌ఎంపై కేసు
ఫ ఇప్పుడు నకిలీ మరణ ధ్రువీకరణతో కారుణ్య ఉద్యోగం ఫైల్ వెళ్లింది
ఇక్కడి నుంచే..


