హైవే.. మృత్యువే! | - | Sakshi
Sakshi News home page

హైవే.. మృత్యువే!

Nov 4 2026 2:26 AM | Updated on Nov 4 2026 2:26 AM

అండర్‌ పాస్‌లు ఏర్పాటు చేయాలి బ్రిడ్జి నిర్మించాలి ప్రమాదాలు జరుగుతున్నాయి

కనీస సూచికలు కరువు

హైవే వెంట ఉన్న మా గ్రామం వద్ద అండర్‌ పాస్‌ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. రోడ్డు దాటే క్రమంలో వాహనాలు ప్రమాదాల బారినపడుతున్నా యి. రాత్రి వేళల్లో స్టేజీ వద్దనే బస్సు దిగి గ్రామస్తులు రోడ్డును భయంతో దాటుతున్నారు. లైటింగ్స్‌ లేకపోవడంతో అతి వేగంతో వాహనాలు వచ్చి ఢీ కొడుతున్నాయి. అధికారులు అండర్‌పాస్‌లు నిర్మించాలి.

–భీమగాని నర్సింహ, చిన్నకందుకూరు

రామాజీపేట గ్రామం వద్ద బ్రిడ్జి నిర్మించాలి. గ్రామానికి గేట్‌ కూడా ఆనుకుని ఉండడంతో రాకపోకలకు మరింత ఇబ్బందులు పడుతున్నాం. మా గ్రామంలోని గోదాములకు నిత్యం వందలాది లారీలు వస్తున్నాయి. రైతులు హైవేను దాటి పొలాలకు వెళ్తుంటారు. రోజు ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది.

– మొగిలిపాక రమేష్‌, రామాజీపేట

పెద్దకందుకూరు స్టేజీ వద్ద రోడ్డు దాటే సమయంలో నిత్యం ప్రమాదాలు జరగుతున్నాయి. ఇప్పటికే గ్రామంలో పలువురు మృతి చెందారు. స్పీడ్‌ బ్రేకర్‌లు, ఇండికేషన్‌లు సరిగ్గా లేవు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అనే భయాందోళనకు గురవుతున్నాము. అండర్‌ పాస్‌ ఏర్పాటు చేస్తే ప్రమాదాలను అరికట్టవచ్చు

–కాళ్లె సురేష్‌, పెద్దకందుకూరు

యాదగిరిగుట్ట రూరల్‌: హైదరాబాద్‌–వరంగల్‌ ప్రధాన జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌ 163) స్థానికులకు ప్రాణసంకటంగా మారింది. యాదగిరిగుట్ట మండల పరిధిలోని పలు గ్రామాల వద్ద జాతీయ రహదారిపై అండర్‌ పాస్‌లు ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారులు, పాదచారులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. వాహనాలు అతివేగంగా దూసుకెళ్తున్న ఈ హైవేపై.. రాత్రి వేళల్లో రోడ్డు దాటాలంటేనే ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది.

అండర్‌పాస్‌లు లేక తప్పని ముప్పు

యాదగిరిగుట్ట మండలంలోని రామాజీపేట, పెద్దకందుకూరు, చిన్నకందుకూరు, బాహుపేట గ్రామాలు హైవేను ఆనుకుని ఉన్నాయి. ఈ గ్రామాల ప్రజలు రోజువారీ పనుల నిమిత్తం నిత్యం హైవేను క్రాస్‌ చేయాల్సి వస్తోంది. అయితే, ఆయా స్టేజీల వద్ద అండర్‌పాస్‌లు లేక అతివేగంగా వచ్చే వాహనాలు రోడ్డు దాటుతున్న ప్రయాణికులను ఢీకొడుతున్నాయి.

కలవరపెడుతున్న గత ప్రమాదాలు

● పెద్దకందుకూరుకు చెందిన సీస భిక్షపతి రోడ్డు క్రాస్‌ చేస్తుండగా వాహనం ఢీకొని మృతి చెందాడు.

● ద్విచక్రవాహనంపై రోడ్డు దాటుతున్న పెద్దకందుకూరు వాసి గుర్రం లక్ష్మిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రాణాలు విడిచింది.

● చిన్నకందుకూరుకు చెందిన ర్యాకల సత్తయ్య పెద్దకందుకూరు వద్ద రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని మృత్యువాత పడ్డాడు.

● చిన్నకందుకూరుకు చెందిన రాజయ్యను కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు.

ప్రమాదాలు నిత్యకృత్యమైనా అధికారులు కనీస భద్రతా చర్యలు చేపట్టడంలేదు. ప్రమాదాలు జరిగే క్రాసింగ్‌ల వద్ద హెచ్చరిక బోర్డులు, రేడియం స్టిక్కర్లు, స్పీడ్‌ బ్రేకర్లు, సరైన లైటింగ్‌ వ్యవస్థ లేవని ప్రజలు వాపోతున్నారు. చీకటి పడితే ఈ క్రాసింగ్‌ల వద్ద పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోంది. అధికారులు స్పందించి హైవే వెంట ఉన్న గ్రామాల వద్ద అండర్‌ పాస్‌లు నిర్మించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

ఫ యాదగిరిగుట్ట మండల పరిధిలోని ఎన్‌హెడ్‌163పై తరచూ ప్రమాదాలు

ఫ రోడ్డు దాటుతూ ప్రాణాలు కోల్పోతున్న స్థానికులు

ఫ కనీస హెచ్చరిక బోర్డులు, లైటింగ్‌ కరువు

ఫ అండర్‌పాస్‌లు నిర్మించాలని వినతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement