రాచకొండ ఎత్తిపోతల ద్వారా సాగునీరు ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

రాచకొండ ఎత్తిపోతల ద్వారా సాగునీరు ఇవ్వాలి

Nov 4 2026 2:26 AM | Updated on Nov 4 2026 2:26 AM

ఫ సీపీఎం కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు

చౌటుప్పల్‌ : రాచకొండ ఎత్తిపోతల పథకం ద్వారా నియోజకవర్గానికి సాగునీరు అందించాలని సీపీఎం కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి.సాగర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాచకొండ లిఫ్ట్‌ పథకం సాధనకు పార్టీ నారాయణపురం మండల కమిటీ ఆధ్వర్యంలో చర్లగూడెం–శివన్నగూడెం రిజర్వాయర్‌ వద్ద ప్రారంభించిన పాదయాత్ర మంగళవారం చౌటుప్పల్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ఆర్డీఓ శేఖర్‌రెడ్డికి వినతిపత్రం అందజేసి వారు మాట్లాడారు. లిఫ్ట్‌ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తే నారాయణపురం సస్యశ్యామలం అవుతుందన్నారు. 2014లో మొదలైన పనులు ఇప్పటికీ అతీగతిలేవన్నారు. నీళ్లు,నిధులు, నియామకాల పేరిట సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం జరగడంలేదన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.డి.జహంగీర్‌, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, జంగారెడ్డి, బూరుగు కృష్ణారెడ్డి, గంగదేవి సైదులు, గోశిక కరుణాకర్‌, ఎం.డి.పాష, రాగీరు కిష్టయ్య, పాదయాత్ర బృందం సభ్యులు సుర్కంటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నర్సిరెడ్డి, దోడ యాదిరెడ్డి, మల్లేపల్లి లలిత, గుంటోజు శ్రీనివాసచారి, గాలయ్య,రాజు, కృష్ణ, జంగయ్య, బాలకృష్ణ, మంగమ్మ, సుందరయ్య, భరత్‌రెడ్డి, శంకరయ్య, శంకరయ్య, దోనూరు నర్సిరెడ్డి, బండ శ్రీశైలం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement