కట్టంగూర్ : ప్రాథమిక పాఠశాలల పాలిట మరణశాసనంగా మారిన జీఓ నంబర్ 25ను తక్షణమే సవరించాలని, జీఓను సవరించకుండా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం సాధ్యం కాదని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిమూలం వెంకట్ అన్నారు. కట్టంగూర్‌లో గత రెండు రోజులుగా జరిగిన టీఎస్ యూటీఎఫ్ 7వ జిల్లా మహాసభలు సోమవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బక్కా శ్రీనివాసాచారి అధ్యక్షతను నిర్వహించిన ప్రతినిధుల సభకు ఆదిమూలం వెంకట్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నవంబర్ నెలలో ఉపాధ్యాయులు 100 శాతం హాజరు కావాలంటూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరుకావడమే సరిపోదని, ఉపాధ్యాయులు సమర్ధవంతంగా బోధన సాగేందుకు అవసరమైన పరిస్థితులను పాఠశాలల్లో ప్రభుత్వం కల్పించాని కోరారు. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ, బలోపేతం కోసం జీఓ 25 సవరణకు ఉపాధ్యాయ సంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
రక్తదానం చేసిన ఉపాధ్యాయులు
ఈ జిల్లా మహాసభల్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి ప్రారంభించి మాట్లాడారు. ఉపాధ్యాయ సంఘాలు తమ హక్కుల కోసం పోరాడుతూనే సామాజిక బాధ్యతను గుర్తించి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా 60 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. రాజశేఖర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, ఉపాధ్యక్షుడు నర్రా శేఖర్‌రెడ్డి, ఎన్. సోమయ్య, మిట్టపల్లి మురళయ్య, ఎడ్ల సైదులు, పాల్వాయి అంజిరెడ్డి, చిక్కుల రామలింగయ్య, గేర నర్సింహ, బి. అరుణ, రాజు, జాల అరుణ, యాట మధుసూదన్‌రెడ్డి, రాచమల్ల రమాదేవి, నలపరాజు వెంకన్న, చిన్న వెంకన్న, పగిళ్ల సైదులు తదితరులు ఉన్నారు.
టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిమూలం వెంకట్


