రైతులకు నష్టపరిహారం చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

రైతులకు నష్టపరిహారం చెల్లించాలి

Nov 3 2026 2:21 AM | Updated on Nov 3 2026 2:21 AM

మునుగోడు, నాంపల్లి : పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి మునుగోడు మండలం చొల్లేడు గ్రామంలో, నాంపల్లి మండలం నరసింహులగూడెం గ్రామంలో ఎండిపోయిన వరి, పత్తి పంటలను పరిశీలించి మాట్లాడారు. పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు జాతీయ ఉపాధి హామీ పథకానికి అదనపు నిధులు కేటాయించాలని కోరారు. అలాగే ఉపాధి హామీ పని దినాలను పెంచి, కరువు కాలం పూర్తయ్యే వరకు ప్రజలకు పనులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. రాబోయే సీజన్‌లో అపరాధ వడ్డీ లేకుండా రైతులకు తిరిగి కొత్త రుణాలు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్‌. అంజయ్య చారి, తిరుపారి వెంకటేష్‌, మహిళా సమాఖ్య జిల్లా కన్వీనర్‌ గిరి రమ, మండల కార్యదర్శి సుదనబోయిన రమేష్‌, సహాయ కార్యదర్శి నేతాళ్ల రాజు, కోరే సత్తయ్య, ఊరుపాక వెంకటయ్య, నేరళ్ల సైదులు, గిరి స్వామి, చెన్నోజు వెంకటాచారి, సర్పంచ్‌ బీసు అరుణ శ్రీశైలం, ఉప సర్పంచ్‌ జాల మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

సీపీఐ జాతీయ కార్యదర్శి

పల్లా వెంకట్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement