వద్దన్నా వరి బాటలో.. | - | Sakshi
Sakshi News home page

వద్దన్నా వరి బాటలో..

Nov 2 2026 2:11 AM | Updated on Nov 2 2026 2:11 AM

ఆరుతడి పంటలపై

అవగాహన కల్పిస్తున్నాం

బీపీటీ రకంపైనే మక్కువ

భువనగిరి: ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో తక్కువగా వర్షాలు కురిశాయి. దీని ప్రభావం వచ్చే జూలై వరకు ఉంటుందని ప్రభుత్వం ప్రకటించి, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచిస్తున్నా రైతులు మాత్రం వినడం లేదు. వద్దన్నా వినకుండా వరి సాగు వైపే మొగ్గుచూపుతున్నారు. జిల్లాలో వానాకాలం సీజన్‌లో లోటు వర్షపాతం నమోదు కావడంతో చాలావరకు చెరువులు, వాగుల్లో నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. అయినప్పటికీ బోరు బావుల కింద వరి సాగు చేసేందుకే ఆసక్తి చూపుతున్నారు.

శ్రమించాల్సిన అవసరం లేకపోవడంతో..

వరి సాగు చేస్తే ప్రస్తుతం రైతులు క్షేత్రస్థాయిలో ఎక్కువ శ్రమించాల్సిన అవసరం లేదని భావిస్తున్నారు. నాట్లు వేసేందుకు కూలీలు అందుబాటులో ఉండటం, పురుగుమందుల పిచికారీకి డ్రోన్లను ఉపయోగించడం, పంట కోతలకు యంత్రాలు లభించడమే ఇందుకు కారణం. అదే ఆరుతడి పంటల సాగుకై తే వ్యవసాయ క్షేత్రాల్లో నిరంతరం శ్రమించాల్సి వస్తోందని వెనకడుగు వేస్తున్నారు. ఒకవేళ శ్రమించి ఆరుతడి పంటలను సాగు చేసినా మార్కెట్‌లో గిట్టుబాటు ధర వస్తుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు.

అవగాహనా లోపం..

సాగునీటి కొరత కారణంగా రైతులు ఆరుతడి పంటలైన పెసర, మినుములు, కందులు, సజ్జలు, శనగతో పాటు కూరగాయలు, ఆకుకూరలు వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో అవగాహన కొరవడటంతో ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది? ఎంత లాభం మిగులుతుంది? అనే విషయాలు తెలియక రైతులు వరి వైపే వెళ్తున్నారు. మరోవైపు అడవి జంతువులు, కోతుల బెడద కారణంగా ఆరుతడి పంటలు చేతికి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని వాపోతున్నారు. పత్తి, వరి విత్తనాలను ఆరుతడి సీజన్‌లో ఎక్కువగా విక్రయించవద్దని సీడ్‌ వ్యాపారులకు అధికారులు సూచించినప్పటికీ అది ఎక్కడా అమలు కావడం లేదు.

యాసంగి పంటల సాగు వివరాలు..

వర్షాలను, సాగునీటి కొరత అంచనాలను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ శాఖ యాసంగి యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేశారు. గత యాసంగి సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 3,46,454 ఎకరాల్లో వరి సాగు కాగా ఈ సారి సాగు విస్తీర్ణం 2,07,354 ఎకరాలకు పరిమితమయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. కానీ ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం వల్ల అంచనాలు తలకిందులయ్యే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు వరి సాగు చేయొద్దనే అధికారులు సూచిస్తున్నారు.

ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉన్నందున ఆరుతడి పంటలు సాగు చేసుకోవడంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. రైతు వేదికల్లో సమావేశాలు నిర్వహించి ఏయే పంటలు వేయాలో సూచిస్తున్నాం. రాబోయే నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకుని బోరు బావుల కింద వరి పంట సాగు చేయొద్దని చెబుతున్నాం. ప్రత్యామ్నాయ పంటలతోనే రైతులకు లాభదాయకంగా ఉంటుంది.

– వెంకటరమణారెడ్డి, డీఏఓ

ఫ సాగునీటి ఎద్దడి హెచ్చరికలు బేఖాతరు

ఫ నారుమళ్లకు కసరత్తు చేస్తున్న రైతులు

ఫ ఆరుతడి పంటల ఊసే లేదు

ప్రభుత్వం, అధికారులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా బోరు బావుల ఆధారంగా రైతులు మూడు నెలల్లో చేతికి వచ్చే బీపీటీ (సాంబ మసూరి) రకం వరి సాగుకే ప్రాధాన్యమిస్తున్నారు. బీపీటీ రకం వరి పండిస్తే ఇంటి అవసరాలకు పనికొస్తుందని, లేదా వ్యా పారులు అధిక ధరలకు తప్పనిసరిగా కొనుగో లు చేస్తారనే నమ్మకంతో ఈ రకంపై ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే జిల్లాలో దుక్కులు దున్ని నారుమ ళ్లు వేసేందుకు పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement