రామగిరి (నల్లగొండ) : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (బీఆర్‌ఏఓయూ) ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఎన్నో అవకాశాలు కల్పిస్తోందని యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఎక్స్‌టెన్షన్ సెంటర్ నోడల్ అధికారి బి.ధర్మానాయక్ అన్నారు. ఆదివారం నల్లగొండ ప్రాంతీయ సమన్వయ కేంద్రంలో ప్రాంతీయ సమన్వయ కేంద్రం కోఆర్డినేటర్ బొజ్జ అనిల్‌కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో ధర్మానాయక్ మాట్లాడారు. యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి బాధ్యతలు స్వీకరించిన అనంతరం దూరవిద్యా విధానంలో అనేక మార్పులు, సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. భూక్యా వీరన్న, కృష్ణారెడ్డి, మహేశ్వరీ, పద్మ హరిత, మహేష్, శ్రీకాంత్ పాల్గొన్నారు.


