ఐలు నూతన కమిటీ ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

ఐలు నూతన కమిటీ ఎన్నిక

Nov 2 2026 2:05 AM | Updated on Nov 2 2026 2:05 AM

భువనగిరిటౌన్‌: భువనగిరిలోని న్యూ వివేరా హోటల్‌లో నిర్వహించిన ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ (ఐలు) యాదాద్రి భువనగిరి జిల్లా రెండవ మహాసభల్లో జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా బోల్లెపల్లి కుమార్‌, ప్రధాన కార్యదర్శిగా వెంకట్‌ రెడ్డి, గౌరవాధ్యక్షుడిగా సోమయ్య ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా మోహన్‌, ఎండీ నిహాల్‌, యాదయ్య, జయ, సహాయ కార్యదర్శులుగా భాస్కర్‌ రెడ్డి, రాజశేఖర్‌ రెడ్డి, శ్రీనివాస్‌, ఐలయ్య, కోశాధికారిగా కిషన్‌ బాధ్యతలు చేపట్టారు. వీరితో పాటు మరో 18 మందిని జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ నూతన కార్యవర్గాన్ని ఐలు రాష్ట్ర అధ్యక్షుడు కొల్లి సత్యనారాయణ, తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు మందడపు శ్రీనివాసరావు, ఐలు కేంద్ర కమిటీ సభ్యుడు వై. శ్రీనివాసరావు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. న్యాయవాదుల హక్కుల పరిరక్షణకు, సమస్యల పరిష్కారానికి నూతన కమిటీ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

స్వయం ఉపాధితో యువత ఆర్థికంగా ఎదగాలి

ఆలేరురూరల్‌: యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకండా స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకొని, ఆర్థికంగా స్థిరపడి స్వశక్తితో ఎదగాలని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆలేరు పట్టణంలోని బస్టాండ్‌ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత స్వయం ఉపాధి రంగాల్లో రాణిస్తూ మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హోటల్‌ యజమాని పూల శ్రవణ్‌, పార్టీ నాయకులు పుట్ట మల్లేశం, సంపత్‌, హరీష్‌, మధు, తదితరులు పాల్గొన్నారు.

డీలర్ల సంఘం ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా ఫయాజ్‌

కోదాడ : రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా కోదాడకు చెందిన డీలర్‌ ఎస్‌కె.ఫయాజ్‌ ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లోని పౌరసరఫరాల శాఖ భవనంలో జరిగిన డీలర్ల సంఘం సమావేశంలో తనను ఏకగ్రీవగా ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఫయాజ్‌ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్‌ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement