యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నిత్య కై ంకర్యాలు పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా నిర్వహించారు. వేకువజామున శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం నిర్వహించి, గర్భాలయంలో స్వయంభూ మూర్తులకు అభిషేక పూజ జరిపించారు. అనంతరం తులసీ దళాలతో సహస్ర నామార్చన, కుంకుమార్చన వంటి పూజలు చేపట్టారు. ఆలయ ముఖ మండపంలో అష్టోత్తరం, సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. ప్రథమ ప్రకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం జరిపించారు. సాయంత్రం జోడు సేవలను ఆలయ వీధుల్లో ఊరేగించారు. రాత్రి శ్రీస్వామి అమ్మవార్లకు పవళింపు సేవ నిర్వహించారు.


