గ్రామాభివృద్ధికే నిధులు ఖర్చు చేస్తాం
యాదగిరిగుట్ట రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో షెడ్యూల్డ్ కులాలు ఎక్కువగా నివసించే గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ‘పీఎం ఆదర్శ్ గ్రామ యోజన’ పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా యాదగిరిగుట్ట మండలం రామాజీపేట, రామన్నపేట మండలం పల్లివాడ గ్రామాలను కేంద్రం ఎంపిక చేసింది. ఈ పథకం ద్వారా వచ్చే నిధులతో తమ గ్రామాలను అన్ని విధాలా అభివృద్ధి చేసుకుంటామని గ్రామస్తులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రం నుంచి నిధులు
ఈ పథకం ద్వారా ఎంపికై న ఒక్కో గ్రామానికి కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షలను గ్రామ పంచాయతీకి అందజేయనుంది. దీంతో పాటు పరిపాలన ఖర్చుల కోసం ప్రత్యేకంగా మరో రూ.40 వేలను ప్రస్తుతం విడుదల చేయనుంది. ఈ నిధులతో గ్రామంలో తాగునీరు, పారిశుధ్యం, విద్య, ఆరోగ్యం, రోడ్ల నిర్మాణం, సామాజిక భద్రత, హౌసింగ్, విద్యుద్దీకరణ, జీవనోపాధి వంటి మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయనున్నారు.
రామాజీపేట గ్రామంలో మండల స్థాయి అధికారులు ఇటీవల సర్వే పనులు పూర్తి చేశారు. గ్రామంలో మొత్తం 298 కుటుంబాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచి, ఉన్నతాధికారులకు నివేదిక పంపించే పనిలో మండల అధికారులు నిమగ్నమయ్యారు. అదేవిధంగా పల్లివాడ గ్రామంలో 700 వరకు కుటుంబాలు ఉన్నాయి. జనాభా 2300 ఉండగా.. ఇందులో ఎస్పీ జనాభా 1100 మంది ఉన్నారు.
ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన కింద మా గ్రామం ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ నిధులతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తాం. గ్రామంలో అన్ని రకాల మౌలిక వసతులు సమకూర్చుకోవడంతో పాటు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటాం.
– గడ్డం దేవేందర్, సర్పంచ్, రామాజీపేట
ఫ ‘పీఎం ఆదర్శ్ గ్రామ యోజన పథకానికి ఎంపికై న రెండు గ్రామాలు
ఫ ఒక్కో గ్రామానికి విడుదల కానున్న రూ.20 లక్షల అభివృద్ధి నిధులు
ఫ పరిపాలన ఖర్చుల కోసం రూ.40 వేలు


