ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తిచేయాలి | - | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తిచేయాలి

Nov 2 2026 2:05 AM | Updated on Nov 2 2026 2:05 AM

సంస్థాన్‌ నారాయణపురం: చర్లగూడెం ప్రాజెక్టు పనులు ఇప్పటికీ పూర్తికాకపోవడం ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శమని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు జ్యోతి ఆరోపించారు. సీపీఎం సంస్థాన్‌ నారాయణపురం మండల కమిటీ ఆధ్వర్యంలో మర్రిగూడ మండలంలోని చర్లగూడెం ప్రాజెక్టు నుంచి సంస్థాన్‌ నారాయణపురం మీదుగా చౌటుప్పల్‌ ఆర్డీవో కార్యాలయం వరకు చేపట్టిన మహాపాదయాత్ర మండలంలోని చిల్లాపురం, వావిళ్లపల్లి, ఆరెగూడెం, జనగాం మీదుగా పుట్టపాక గ్రామానికి చేరుకుంది. పుట్టపాకలో ఆదివారం నిర్వహించిన సభలో ఆమె మాట్లాడారు. చర్లగూడెం ప్రాజెక్టు నుంచి రాచకొండ లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు ప్రభుత్వం సర్వే నిర్వహించినందున డీపీఆర్‌ సిద్ధం చేసి నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఫ్లోరోసిస్‌ సమస్యతో ఈ ప్రాంత ప్రజలు ఇప్పటికే అనేక అవస్థలు పడ్డారని తెలిపారు. రాచకొండ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాన్ని వెంటనే మంజూరు చేయాలన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జహంగీర్‌ మాట్లాడుతూ... మండలంలో సాగునీటి సమస్య పరిష్కరించాలన్నారు. చర్లగూడెం ప్రాజెక్టు పనులు పూర్తి చేసి నిర్వాసితులకు పెండింగ్‌లో ఉన్న పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు.

ఫ సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు జ్యోతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement