ఫ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్
భువనగిరి: రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవాదుల పాత్ర కీలకంగా ఉంటుందని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. భువనగిరి పట్టణంలోని న్యూ వివేరా హోటల్‌లో నిర్వహించిన ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్(ఐలు) జిల్లా రెండవ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాపాడటం న్యాయవాదుల బాధ్యత అని అన్నారు. ఐలు రాష్ట్ర అద్యక్షుడు కొత్త సత్యనారాయణ మాట్లాడుతూ.. న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఐక్య ఉద్యమానికి సిద్ధం కావాలన్నారు. ఐలు జిల్లా అధ్యక్షుడు బొల్లేపల్లి కుమార్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు మందాడపు శ్రీనివాస్‌రావు, జడ్జి మాధవిలత, ఐలు జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడి వెంకట్‌రెడ్డి, విద్యాసాగర్, కుక్కదువ్వు సోమ య్య, రవీందర్‌రెడ్డి, హనుమంతు, మోహన్, నేహల్, కిషన్, ఐలయ్య పాల్గొన్నారు.


