పారుపల్లి యువకులు పాల్గొన్న ప్రధాన రన్నింగ్ ఈవెంట్లు కొన్ని..
రన్నింగ్‌కు కేరాఫ్‌గా గ్రామ యువత
పారుపల్లి గ్రామంలోని 22 నుంచి 39 ఏళ్ల లోపు యువకులు కొందరు ఉద్యోగాలు, మరికొందరు వ్యాపారాల్లో స్థిరపడ్డారు. వీరంతా ఫిట్‌నెస్ కోసం మొదట10 మందితో రన్నింగ్ ప్రారంభించారు.
ఫ వంద మందితో యాదాద్రి రన్నింగ్ క్లబ్ ఏర్పాటు
ఫ చందాలు వేసుకుని ఈవెంట్లకు హాజరు
ఫ వ్యసనాల నుంచి యువతను కాపాడటమే లక్ష్యం
క్రమంగా
సభ్యుల సంఖ్య 100కు చేరింది. వారంతా కలిసి యాదాద్రి భువనగిరి రన్నింగ్ క్లబ్‌గా ఏర్పడ్డారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో నిర్వహించిన ఇంటర్నేషనల్ మారథాన్ (42.1 కి.మీ)లో పారుపల్లికి చెందిన కాలె వినయ్, మోటె రాజు పాల్గొని సత్తా చాటారు. తెలంగాణ రన్నర్స్ నిర్వహించే హాఫ్ మారథాన్‌లోనూ పాల్గొంటున్నారు. అంతేకాకుండా హైదరాబాద్‌లో వివిధ రంగాల్లో ఉన్న గ్రామ యువకులంతా కలిసి ప్రతి ఆదివారం క్రికెట్ ఆడుతూ యువతను వ్యాయామం వైపు మళ్లిస్తున్నారు.
రాజాపేట : ఉరుకుల పరుగుల జీవితంలో నేటి యువత ఒత్తిడితో వ్యసనాల బారిన పడుతుంటే.. ఆ పల్లె యువకులు మాత్రం ఆరోగ్యమే లక్ష్యంగా పరుగులు తీస్తున్నారు. రాజాపేట మండలంలోని పారుపల్లికి చెందిన యువకులు శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసం కోసం రన్నింగ్‌ను ఎంచుకున్నారు. 2కే రన్ నుంచి 42.1 కిలో మీటర్ల మారథాన్‌లో పాల్గొని తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. యువతను డ్రగ్స్,
సెల్‌ఫోన్లకు దూరంగా
ఉంచేందుకు సొంత
ఖర్చులతో రన్నింగ్ ఈవెంట్లు నిర్వహిస్తున్నారు.
వివిధ ప్రాంతాల్లో ఈవెంట్లలో పాల్గొనేందుకు గ్రూపులోని ప్రతి సభ్యుడు నెలకు రూ.200 చొప్పున చందా వేసుకుంటారు. ఆ డబ్బులతోనే ఈవెంట్లకు వెళ్లి వస్తారు. డ్రగ్స్, స్మార్ట్‌ఫోన్‌కు యువత బానిసలవ్వకుండా వారిని సరైన దారిలో పెట్టేందుకు పారుపల్లి, బొందుగుల గ్రామాల్లో 5కే రన్నింగ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఇందులో 150 మంది పాల్గొనగా.. వారికి డ్రగ్స్ వలన కలిగే నష్టాలను వివరిస్తూ చైతన్యపరుస్తున్నారు. త్వరలో మండల వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు సంసిద్ధమవుతున్నారు.
పారుపల్లిలో 5కే రన్‌లో
పాల్గొన్న యువకులు
ఫ ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన యాదాద్రి టెంపుల్ రన్(5కే, 10కే, 21.2 కి.మీ)లో పాల్గొన్నారు.
ఫ మార్చిలో నిర్వహించిన రాచకొండ ఆరోగ్య రన్ (5కే, 10కే)లోనూ
పాల్గొన్నారు.
ఫ జూన్ 7న తెలంగాణ రన్నింగ్ ఈవెంట్‌లో 5కే, 10కే, 21.2కే పరుగు పందెంలో పాల్గొన్నారు.
ఫ ఈ ఏడాది ఆగస్టు 30న హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఎన్‌ఎండీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ మారథాన్(42.1 కి.మీ.)లో పాల్గొన్నారు.
ఫ అక్టోబర్ నెలలో వికారాబాద్‌లో నిర్వహించిన హిల్స్ 5కే, 10కే, 16కే, 32కే రన్‌లో పాల్గొన్నారు.
ఫ డిసెంబర్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరగనున్న గోదావరి మారథాన్‌లో పాల్గొనేందుకు
సన్నద్ధమవుతున్నారు.


