యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు శనివారం రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా రానున్నారు. ఇందుకు సంబంధించి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 9గంటలకు లోక్ భవన్ నుంచి గవర్నర్ బయల్దేరి ఉదయం 10.30గంటలకు ప్రెసిడెన్షియల్ సూట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి 10.55గంటలకు యాదగిరి కొండపైకి వచ్చి శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం 11గంటలు కొండకు దిగువన ఉన్న దీక్షాపరుల మండపంలో జనార్దననంద సరస్వతీ స్వామి సంస్కృత ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 26వ తెలంగాణ వేద విద్వాన్ మహాసభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12గంటలకు అక్కడి నుంచి ప్రెసిడెన్షియల్ సూట్‌కు చేరుకొని అక్కడ లంచ్ చేస్తారు. మధ్యాహ్నం 12.50గంటలకు ప్రెసిడెన్షియల్ సూట్ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్తారు.
పోలీసులు సామాజిక బాధ్యత కలిగి ఉండాలి
భువనగిరి : పోలీసులు విధి నిర్వహణతోపాటు సామాజిక బాధ్యత కలిగి ఉండాలని కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అక్షాంశ్ యాదవ్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం భువనగిరిలోని పెద్దచెరువు కట్టపై స్వచ్ఛత మన బాధ్యత అనే నినాదంతో శ్రమదానం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ, డీఎస్పీలు రవీందర్, శ్రీనివాస్‌నాయుడు, సురేష్, సీఐలు హనుమంత్‌నాయక్, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, చందుబాబు, ఆర్‌ఐలు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఎస్‌హెచ్‌ఓలు అనిల్‌కుమార్, ఎస్‌ఐలు, మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్ చైర్‌పర్సన్ పోతంశెట్టి మంజుల, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవెజ్ చిస్తీ తదితరులు పాల్గొన్నారు.
రక్తహీనతను నివారిద్దాం
భువనగిరి : చికిత్స ద్వారా రక్తహీనతను నివారిద్దామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ మనోహర్ అన్నారు. శుక్రవారం భువనగిరి కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అనీమియా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా రిపోర్టింగ్ సూపర్‌వైజర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రక్తహీనత ఉన్న వారిని సకాలంలో గుర్తించి చికిత్స అందించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ సుమన్ కళ్యాణ్, డాక్టర్ రామకృష్ణ, వీణ, శిక్షకులు పాల్గొన్నారు.
ఉత్తమ ఫలితాలు సాధించాలి
వైభవంగా ఊంజల్ సేవోత్సవం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఊంజల్ సేవోత్సవాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. శుక్రవారం ఆండాళ్ అమ్మవారికి ఇష్టమైన రోజు కావడంతో సాయంత్రం వేళ మండపంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం ఆండాళ్ అమ్మవారిని ప్రత్యేక పల్లకిపై అధిష్టించి ఆలయ మండపంలో భక్తుల నడుమ ఊరేగించారు. అద్దాల మండపంలో ఆండాళ్ దేవిని అధిష్టించి ఊంజల్ సేవోత్సవాన్ని జరిపించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయంలో రాత్రి వరకు పూజలు కొనసాగాయి.


