యాదగిరి క్షేత్రం అభివృద్ధే ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

యాదగిరి క్షేత్రం అభివృద్ధే ధ్యేయం

Oct 31 2026 8:19 AM | Updated on Oct 31 2026 8:19 AM

యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. యాదగిరి కొండపైన వైటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్‌ ఎం.సత్యనారాయణరెడ్డి తన సొంత నిధులతో చేపట్టిన నిత్య కల్యాణ మండపానికి, రాయగిరి వద్ద ఆర్చి నిర్మాణానికి శుక్రవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌ కుమార్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతితో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదగిరి క్షేత్రానికి వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని వైటీడీ ధర్మకర్తల మండలి సంకల్పిస్తోందన్నారు. వైటీడీ చైర్మన్‌ మన్నె సత్యనారాయణరెడ్డి తన సొంతంగా రూ.10కోట్లతో కల్యాణ మండపం, రాయగిరి వద్ద ఆర్చి నిర్మాణానికి ముందుకు రావడం చాలా సంతోషకరమన్నారు. ఆధ్యాత్మిక కేంద్రంగా, యూనివర్సిటీ, వేద పాఠశాల, డార్మింటరీ హాల్‌ నిర్మాణం చేసి తిరుమల తిరుపతి తరహాలో అభివృద్ధి చేయాలనేది సీఎం రేవంత్‌రెడ్డి సంకల్పమని పేర్కొన్నారు. అనంతరం వైటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్‌ మన్నె సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ ధర్మకర్తల మండలి బోర్డు ఏర్పాటు జరిగిన నాలుగు నెలల కాలంలో కల్యాణ మండపం, స్వాగత తోరణం నిర్మాణానికి మొదటి పడుగు పడిందన్నారు. యాదగిరి క్షేత్రానికి క్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమాల్లో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌ కుమార్‌రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు, ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ కుమార్‌, ధర్మకర్తల మండలి సభ్యులు ఈశ్వరమ్మ, తూళ్ళ విజయేందర్‌గౌడ్‌, లక్ష్మీనారాయణనాయక్‌, గుండా మల్లయ్య, కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఈఓ భవాని శంకర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు గుండ్లపల్లి వాణి భరత్‌గౌడ్‌, తంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్‌, ఆలయాధికారులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

ఫ ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య

ఫ అభివృద్ధికి ఇప్పుడే మొదటి అడుగు పడింది

ఫ వైటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్‌ మన్నె సత్యనారాయణరెడ్డి

ఫ కల్యాణ మండపం, రాయగిరిలో ఆర్చి నిర్మాణానికి భూమిపూజ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement