మోత్కూరు: చేనేత కార్మికుల అభ్యన్నతికి బ్యాంకులు సహకారం అందిస్తాయని ఆర్‌బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ హేమలత అన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం, ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా మోత్కూరులో గురువారం ‘వీవర్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్’ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్బీఐ, నాబార్డ్, చేనేత శాఖ అధికారులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు మోత్కూరు చేనేత సహకార సంఘం క్లస్టర్‌ను సందర్శించారు. అధికారులు మగ్గాలపై నేత పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం చేనేత కార్మికులతో ముఖాముఖి మాట్లాడి, వృత్తిపరంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.చేనేత రంగ అభివృద్ధికి బ్యాంకుల ద్వారా అందించే రుణ సదుపాయాలు, నాబార్డు సహకారం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న రాయితీ పథకాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలపై కార్మికులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంకు మేనేజర్ వీరన్న, నాబార్డు డీడీఎం ఝాన్సీరాణి, చేనేత జౌళి శాఖ ఏడీఓ సచిన్, అధికారి తేజేశ్వర్‌రావు, అసిస్టెంట్ లీడ్ బ్యాంకు మేనేజర్ వంశీ, ఎస్‌బీఐ మేనేజర్ కిరణ్‌కుమార్, తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ సత్యనారాయణ, కెనరా బ్యాంకు మేనేజర్ మహేష్, ఈడీసీ మేనేజర్ రంజిత్, స్ఫూర్తి చైర్మన్ మంచె గోవర్దన్, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు వంగరి రాములు పాల్గొన్నారు.
ఇన్సూరెన్స్ చేయించుకోవాలి
గుండాల: బ్యాంకు ఖాతా ఉన్న ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని ఆర్‌బీఐ ఏజీఎం హేమలత కోరారు. గురువారం బ్రాహ్మణపల్లి గ్రామంలో ఎస్‌బీఐ, ఎస్‌ఎస్‌టీఎన్‌జీవో ఆధ్వర్యంలో ఆర్థిక అంశాలు, బ్యాంకింగ్ సేవలపై అవగాహన సభ నిర్వహించారు. కార్యక్రమంలో నాబార్డు డీడీఎం కె.ఝాన్సీరాణి, ఎల్‌డీఎం వంశీ, డీజీపీ మేనేజర్ నరేష్, సర్పంచ్ సుధాకర్, ఉప సర్పంచ్ పెద్దిరాజు, ఎస్‌ఎస్‌బీ కౌన్సిలర్లు మల్లేష్, ప్రవీణ్, ఈడీసీ మేనేజర్ రంజిత్, సీసీ వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి సోఫియా, మారోజు మధు, నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.


