రామన్నపేట: మత్తు పదార్థాల నిర్మూలన, సైబర్ నేరాల నియంత్రణ ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామని జిల్లా ఎస్పీ అక్షాంశ్‌యాదవ్ పిలుపునిచ్చారు. గురువారం రామన్నపేట సర్కిల్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలన–సైబర్ నేరాల నియంత్రణపై ఏర్పాటు చేసిన అవగాహన పరుగును ఆయన ప్రారంభించారు. స్థానిక యువకులు, పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి 2కి.మీ దూరం పరుగెత్తి ఉత్సాహ పరిచారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశానికి అతిపెద్ద సంపద అయిన యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా కాపాడుకోవాల్సిన గురుతర బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్‌రెడ్డి, సీఐ ఎం.రవి, ఏడుకొండలు, ఎస్‌ఐలు జి.సతీష్, శ్రీకాంత్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, సతీష్, వెంకట్‌రెడ్డి ఏఎస్‌ఐ సురేందర్, హెడ్‌కానిస్టేబుల్ కమలాకర్, వెంకటేశ్వర్లు, సిబ్బంది లింగస్వామి, స్వామినాయక్, ప్రవీణ్, ప్రశాంత్, స్వామి, మధు, కృష్ణమూర్తి, నర్సింహ, లావణ్య, కవిత, సైదులు, సైదయ్య వివిధ పాఠశాలలు, కళాశాలల అధ్యాపకులు పాల్గొన్నారు.
ఫ రామన్నపేటలో 2కే రన్ ప్రారంభ సభలో ఎస్పీ అక్షాంశ్‌యాదవ్


