వ్యవసాయ రంగ పరిరక్షణకు పోరాటాలు | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయ రంగ పరిరక్షణకు పోరాటాలు

Oct 30 2026 7:36 AM | Updated on Oct 30 2026 7:36 AM

నల్లగొండ టౌన్‌: బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ రంగంపై, రైతులపై కొనసాగిస్తున్న దాడులకు వ్యతిరేకంగా భవిష్యత్తులో చేపట్టాల్సిన పోరాటాల కార్యాచరణను కిసాన్‌ సభ మహాసభల్లో చర్చిస్తామని అఖిల భారత కిసాన్‌ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణన్‌ తెలిపారు. నవంబర్‌ 15 నుంచి 18 వరకు నల్లగొండలో జరగనున్న మహాసభల సందర్భంగా నిర్వహించే బహిరంగ సభా స్థలాన్ని గురువారం ఆయన పరిశీలించారు. ఈ మహాసభలకు దేశవ్యాప్తంగా 1,200 మందికి పైగా ప్రతినిధులు హాజరుకానున్నారని చెప్పారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్‌ మాట్లాడుతూ.. మహాసభల మొదటి రోజు లక్ష మంది రైతులతో భారీ ప్రదర్శన, బహిరంగ సభ, వేలాది మంది యువ కార్యకర్తలతో రెడ్‌ షర్ట్‌ వలంటీర్ల కవాతు ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు శోభనాయక్‌, ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, ఉడుత రవీందర్‌, ఎండీ సలీం, దండంపల్లి సత్తయ్య, నలపరాజు సైదులు, పరిపూర్ణాచారి, భీమగాని గణేష్‌ పాల్గొన్నారు.

అఖిల భారత కిసాన్‌ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement