కేతేపల్లి: ఏఎమ్మార్పీ కాల్వల ద్వారా నకిరేకల్ నియోజకవర్గంలోని చెరువులు, కుంటలు నింపాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి కేతేపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో నియోజకవర్గంలోని అన్ని చెరువులను నింపి రాబోయే వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. నాలుగు నెలలుగా కరువు పరిస్థితులు నెలకొన్నా నీటిని విడుదల చేయకుండా తాత్సారం చేసిన పాలకులు.. నేడు చెరువులు తామే నింపుతున్నట్లు ప్రచార ఆర్భాటానికి తెరలేపారని మండిపడ్డారు. సమావేశంలో నకిరేకల్ ఏఎంసీ మాజీ చైర్మన్ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం వెంకట్‌రెడ్డి, చిమట వెంకన్న, కొర్లపహాడ్ సర్పంచ్ సైదిరెడ్డి, నాయకులు కొండ సైదులు, బొప్పని సురేష్, సత్యనారాయణ, సైదులు, చేతన్, ఎస్‌కే.యూసుఫ్ పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య


