తిరుమలగిరి (తుంగతుర్తి) : తెలుగు జానపద గేయాల గొప్పదనాని విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో తెలుగు ఉపాధ్యాయుడు ప్రత్యక్ష అనుభవం కలిగే విధంగా పాఠ్యాంశ బోధన నిర్వహించారు. గురువారం తిరుమలగిరి మండలం గుండెపురి జెడ్పీహెచ్‌ఎస్‌లో తెలుగు ఉపాధ్యాయుడు పరాల నాగరాజు 8వ తరగతి తెలుగు జానపద గేయాలు అనే పాఠ్యాంశాన్ని విద్యార్థులకు బోధించేందుకుగాను.. జానపద గేయాలు పాడి అలరించిన గ్రామానికి చెందిన 70 ఏళ్ల ఐలమ్మను పాఠశాలకు ఆహ్వానించి ఆమెతో గేయాలను పాడించారు. ఇందులో విద్యార్థులను కూడా భాగస్వాములు అయ్యే విధంగా చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మావతి, ఉపాధ్యాయ బృందం ఆయనను అభినందించారు.


