లైసెన్స్‌డ్‌ రివాల్వర్‌తో గాల్లోకి కాల్పులు | - | Sakshi
Sakshi News home page

లైసెన్స్‌డ్‌ రివాల్వర్‌తో గాల్లోకి కాల్పులు

Oct 30 2026 7:36 AM | Updated on Oct 30 2026 7:36 AM

● సుమోటోగా కేసు నమోదు

నకిరేకల్‌: విజయ దశమి సందర్భంగా లైసెన్స్‌డ్‌ రివాల్వర్‌తో గాల్లోకి కాల్పులు జరిపిన బీఆర్‌ఎస్‌ నేతపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. నకిరేకల్‌ మండలం నెల్లిబండ గ్రామంలో దసరా వేడుకల సందర్భంగా అదే రోజు రాత్రి బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నేత, స్థానిక మాజీ సర్పంచ్‌ చింతల సోమన్న తన వద్ద ఉన్న లైసెన్స్‌డ్‌ రివాల్వర్‌తో గాల్లోకి కాల్పులు జరిపారు. గ్రామస్తులు ఈవిషయంపై జిల్లా పోలీస్‌ ఉన్నాధికారులకు పోస్టు ద్వారా ఫిర్యాదు అందించారు. ఈమేరకు చింతల సోమన్నపై నిబంధనల ఉల్లంఘన కింద గత రెండు రోజుల క్రితం సుమోటోగా కేసు నమోదు చేసినట్లు నకిరేకల్‌ సీఐ హరిబాబు తెలిపారు.

కంచుగట్లగూడెంలో

కొండచిలువ కలకలం

నాగారం : మండలంలోని పేరబోయినగూడెం ఆవాసం కంచుగట్లగూడెంలో వరికోత మిషన్‌ కింద పడి సుమారు 7అడుగుల భారీ కొండ చిలువ మృతి చెందింది. గ్రామానికి చెందిన రైతు కంచుగట్ల నరేష్‌ గురువారం తన వరిపొలాన్ని హార్వేస్టర్‌ మిషన్‌ ద్వారా కోయిస్తున్నాడు. ఈ క్రమంలో చేనులో ఉన్న సుమారు 7 అడుగుల పొడవైన కొండచిలువ వరికోత మిషన్‌ కింద పడి మృతి చెందింది. వారం రోజుల క్రితం ఇదే గ్రామంలో రైతు బీనబోయిన లింగయ్య పొలంలో వరి కోయిస్తుండగా 8 అడుగుల కొండచిలువ వరికోత యంత్రం బెల్టులో పడి మృతి చెందింది. ఈ ఘటన మరువక ముందే ఇదే గ్రామంలో మరో కొండ చిలువ రావడంతో రైతులు భయాందోళన చెందుతున్నారు.

రసాయన వ్యర్థాలు తిని

13 గొర్రెలు మృత్యువాత

మునగాల: మండల పరిధిలోని మాధవరం శివారులో రసాయన వ్యర్థాలు తిని 13గొర్రెలు మృత్యువాత పడ్డాయి. మాధవరం గ్రామానికి చెందిన పలువురు గొర్రెల కాపరులు రోజు మాదిరిగా తమ గొర్రెలను మేపుకుంటూ బయలుదేరారు. ఈ క్రమంలో జాతీయ రహదారి వెంట గంగమ్మ గుడి వద్ద కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రసాయన వ్యర్థాలు వదిలి వెళ్లడంతో ఆ ప్రాంతానికి వచ్చిన గొర్రెలు వాటిని తిన్నాయి. దీంతో మాధవరం గ్రామానికి చెందిన దాసరి చినసైదులుకు చెందిన మూడు గొర్రెలు, దాసరి లింగోజికి చెందిన మూడు గొర్రెలు, దాసరి భద్రయ్యకు చెందిన ఐదు గొర్రెలు, కొత్తపల్లి చెందిన రెండు గొర్రెలు మృతిచెందాయి. మరో 25గొర్రెలకు మండల పశువైద్యాఽధికారి భాస్కర్‌ ఆధ్వర్యంలో సిబ్బంది చికిత్స అందించారు. తమకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధిత గొర్రెల కాపరులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement