అందరికీ మేరీమాత దీవెనలు అందాలి | - | Sakshi
Sakshi News home page

అందరికీ మేరీమాత దీవెనలు అందాలి

Oct 30 2026 7:36 AM | Updated on Oct 30 2026 7:36 AM

మఠంపల్లి: లోకంలోని జనులందరికీ మేరీమాత దీవెనలు అందాలని, అందుకు మరియదల మహిళా సభ్యులంతా కృషిచేయాలని నల్లగొండ మేత్రాసన పీఠాధిపతి డాక్టర్‌ దమన్‌కుమార్‌ అన్నారు. గురువారం మఠంపల్లి మండల కేంద్రంలోని మేరీమాత (శుభవార్త చర్చి) పుణ్యక్షేత్రంలో నిర్వహించిన నల్ల గొండ, మహబూబ్‌నగర్‌, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల స్థాయి మరియదల మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మేరీమాతకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. లోకంలోని జనులనుద్ధరించేందుకు దైవ కుమారుడైన ఏసుక్రీస్తుకి జన్మనిన్చిన పరమ పవిత్రురాలు మేరీమాత అని అన్నారు. మరియదల సభ్యులంతా మేరీమాత ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. స్థానిక బృందం ఆలపించిన క్రైస్తవ గేయాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మహాసభకు నాలుగు జిల్లాకు చెందిన సుమారు 650 మహిళా సభ్యులు హాజరుకాగా.. స్థానిక రెవరెండ్‌ ఫాదర్‌ పోగుల రాజిరెడ్డి, రాజా, జోసెఫ్‌, భానుప్రసాద్‌, చిన్నయ్య, అనిల్‌, అల్లంబాల, శాంతిరెడ్డి, అరుణ్‌, బాలశౌరీ, లిమోజోసెఫ్‌, ఎం.జోసెఫ్‌, జోజిబాబు, సెబాస్టీన్‌, బ్రదర్‌ ప్రసాద్‌, స్థానిక పెద్దలు ఆదూరికిషోర్‌రెడ్డి, గాదె జయభారత్‌ రెడ్డి, తిరుమలరెడ్డి బాలశౌరిరెడ్డి, సెబాస్టీన్‌రెడ్డి, బోయపాటి ఆంతోనిరెడ్డి, గాలి చిన్నపురెడ్డి, ఆదూరి లూర్దురెడ్డి, మరియదల సభ్యులు ఆంతోని మేరమ్మ, ఆరోగ్యమ్మ, అన్నమ్మ, మేరమ్మ, టీ.మేరమ్మ పాల్గొన్నారు.

నల్లగొండ మేత్రాసన పీఠాధిపతి

దమన్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement