హాలియా : రాజ్యాధికారంతోనే బీసీల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. రాజ్యాధికార పాదయాత్రలో భాగంగా ఆయన చేపట్టిన పాదయాత్ర గురువారం రాత్రి హాలియాకు చేరుకుంది. ఈ సందర్భంగా బీసీ సంఘాల ప్రతినిధులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం పట్టణంలోని ప్రధాన సెంటర్లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. 70 ఏళ్లు పాలించిన పాలకులు బీసీలను అణగదొక్కారని ఆరోపించారు. కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ మూడేళ్లయినా రిజర్వేషన్ ఇవ్వకపోగా మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి కొంతమంది అగ్రవర్ణాలను ఉసిగొలిపి హైకోర్టులో బీసీల రిజర్వేషన్ను నిలిపివేయించారని విమర్శించారు. రాజ్యాధికారం వస్తే హక్కులు వస్తాయని ప్రతి ఒక్కరూ రాబోయే ఎన్నికల్లో బీసీలకు ఓట్లు వేసి అధికారంలోకి వచ్చేలా చూడాలని పిలుపునిచ్చారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజనీకుమార్ యాదవ్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బంధారపు నర్సయ్య గౌడ్, రాష్ట్ర కార్యదర్శి బిక్కునాయక్, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కోట్ల వాసుదేవ్, పూజిత, శివ. అజయ్, బాలు నాయక్, రవీంద్ర నాయక్, వెంకటేశ్వర్లు యాదవ్ పాల్గొన్నారు.
తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న


