కుండల విక్రయాలపై ఇరువర్గాల ఘర్షణ | - | Sakshi
Sakshi News home page

కుండల విక్రయాలపై ఇరువర్గాల ఘర్షణ

Oct 30 2026 7:36 AM | Updated on Oct 30 2026 7:36 AM

మునుగోడు: కుండల విక్రయాలు కుమ్మరి కులస్తుల మధ్య చిచ్చురేపాయి. మునుగోడులో ప్రతి గురువారం జరిగే వారపు సంతలో కుండలు అమ్ముకునే విషయంలో కొంత కాలంగా వివాదం కొనసాగుతుండగా.. గురువారం ఏకంగా దాడులు చేసుకునే వరకు వచ్చింది. మునుగోడు పట్టణంలో తాతముత్తాల కాలం నుంచి నివాసం ఉంటూ కుండలు అమ్ముకుంటున్నవారే సంతలో కుండలు విక్రయించాలని ఒక వర్గం పట్టుబడుతుతోంది. గత 20, 30 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం మునుగోడుకు వచ్చి ఇక్కడే స్థిరపడిన వారు కూడా సంతలో కుండలు అమ్ముకుంటామని మరొక వర్గం గత నెల క్రితం గ్రామ పంచాయతీ వద్ద ఆందోళనకు దిగారు. స్థానిక పోలీసులను ఆశ్రయించగా సర్పంచ్‌, పలువురు పెద్దలు జోక్యం చేసుకొని సంతలో ఎవరైనా కుండలు అమ్ముకోవచ్చని తెలిపారు. దీంతో తమకు మాత్రమే కుండలు అమ్ముకునే అవకాశం ఇవ్వాలని పూర్వం నుంచి ఉంటున్న వారు ఇటీవల ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈక్రమంలో గురువారం సంతలో రెండు వర్గాల మధ్య వివాదం ముదిరి దాడులు చేసుకున్నారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్‌ఐ శోభన్‌బాబు తన సిబ్బందితో అక్కడకు చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టాడు. ఇరువర్గాల వారు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి, చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై కేసులు నమోదు చేస్తామని ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement