నీటి సంరక్షణ మన అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

నీటి సంరక్షణ మన అందరి బాధ్యత

Oct 29 2026 1:36 AM | Updated on Oct 29 2026 1:36 AM

భూదాన్‌పోచంపల్లి: ఎల్‌నినో నేపథ్యంలో నీటిని వృథాచేయకుండా సంరక్షించడం మనందరి బాధ్యత అని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖలోని భూగర్భ జల మండలి రీజినల్‌ డైరెక్టర్‌ ఎన్‌. జ్యోతికుమార్‌ పేర్కొన్నారు. బుధవారం భూదాన్‌పోచంపల్లి మండలంలోని పిలాయిపల్లి గ్రామంలో విజిలెన్స్‌ అవేర్‌నెస్‌ వీక్‌–2026లో భాగంగా జల సంరక్షణపై అగాహహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు కురవక భవిష్యత్తులో కరువు పరిస్థితులు ఏర్పడనున్నాయని అన్నారు. ఈ నేపథ్యం నీటి వనరులను పొదుపువాడుకోవాలని సూచించారు. అనంతరం గ్రామస్తులచే సమూహిక ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ బందారపు లక్ష్మణ్‌గౌడ్‌, పెరుమాండ్ల దానయ్య, పంచాయతీకార్యదర్శి ధనుంజయ్య, పీఏసీఎస్‌ పీఐసీ డైరెక్టర్‌ అందెల విజయశ్రీనివాస్‌, జలమండలి శాస్త్రవేత్తలు పెరిక యాదయ్య, సరిత, ఓబులేశ్‌, విఠల్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement