డెంగీ, ఇతర వైరల్ ఇన్ఫెక్షన్ల కారణంగా బాధితులకు రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య వేగంగా తగ్గుతోంది. ఈ లక్షణాలతో పీహెచ్‌సీలు, సీహెచ్సీలలో చేరిన వారి నుంచి రక్త నమూనాలు సేకరించి భువనగిరిలోని తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్‌కు పంపిస్తున్నారు. అయితే ఈ పరీక్షల నివేదికలు రావడానికి మూడు రోజుల వరకు సమయం పడుతోంది. ఉదాహరణకు ఆలేరు సీహెచ్‌సీ నుంచి శుక్రవారం పంపిన రక్త నమూనాల రిపోర్టులు సోమవారం వరకు కూడా రాలేదు. దీంతో అనివార్య పరిస్థితుల్లో రోగులు ప్రైవేట్ ల్యాబ్‌లను ఆశ్రయించి వేలకు వేలు ఖర్చు చేసుకుంటున్నారు.


