రోడ్డు ప్రమాదంలో బీఆర్‌ఎస్‌ నాయకుడు మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో బీఆర్‌ఎస్‌ నాయకుడు మృతి

Oct 29 2026 1:36 AM | Updated on Oct 29 2026 1:36 AM

శాలిగౌరారం: 365 నంబరు జాతీయ రహదారిపై శాలిగౌరారం మండలంలోని మాదారం కలాన్‌ వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఆర్‌ఎస్‌ నాయకుడు మృతి చెందాడు. మండలంలోని ఇటుకులపహాడ్‌ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకుడు అంబటి అంజయ్య(66) చేపల చెరువు కాంట్రాక్టర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం రాత్రి ఆయన ఇటుకులపహాడ్‌ నుంచి హైవే మీదుగా ద్విచక్రవాహనంపై అర్వపల్లికి బయలుదేరాడు. మార్గమధ్యంలో మాదారంకలాన్‌ గ్రామ శివారులో గల పెట్రోల్‌బంక్‌ వద్ద మరమ్మతులకు గురై రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న అంజయ్య తలకు తీవ్రగాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లాపోయాడు. గమనించిన స్థానికులు అంజయ్యను చికిత్స నిమిత్తం నకిరేకల్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అంజయ్య మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడు అంజయ్యకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement