రేణుకా ఎల్లమ్మ ఆలయంలో యక్షగాన ప్రదర్శన | - | Sakshi
Sakshi News home page

రేణుకా ఎల్లమ్మ ఆలయంలో యక్షగాన ప్రదర్శన

Oct 29 2026 1:36 AM | Updated on Oct 29 2026 1:36 AM

కనగల్‌ : దర్వేశిపురం స్టేజీ వద్దగల శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయ సన్నిధిలో సూర్యాపేట జిల్లా నాగారం మండలం డి.కొత్తపల్లి గ్రామానికి చెందిన ధనుంజయ్‌ కళాబృందం సభ్యులు బుధవారం శశిరేఖ పరిణయం యక్షగాన ప్రదర్శన నిర్వహించారు. ఇందులో సుభద్రగా ధనుంజయ్‌, బలరాముడిగా భుజంగం, అభిమన్యుడిగా బాలకృష్ణ, శశిరేఖగా కుమార్‌, ఘటోత్కచుడిగా రాము, ఇతర పాత్రలో శారద నటించారు. ఈ యక్షగాన నాటక ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ చీదేటి వెంకట్‌ రెడ్డి, ఈఓ అంబటి నాగిరెడ్డి, జూనియర్‌ అసిస్టెంట్‌ కూసం ఉపేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement