ఆర్టీసీకి దసరా బొనాంజా | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీకి దసరా బొనాంజా

Oct 29 2026 1:36 AM | Updated on Oct 29 2026 1:36 AM

సమష్టి కృషికి

లభించిన ఫలితం

పండుగ రద్దీని తట్టుకుని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది బస్సులను సురక్షితంగా నడిపారు. ఆర్టీసీపై ప్రయాణికులు ఉంచిన నమ్మకానికి సంస్థ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ భారీ విజయంలో భాగస్వాములైన డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ మెకానిక్‌లు, ట్రాఫిక్‌ సూపర్‌వైజర్లు, డిపో మేనేజర్లు, పాలనా సిబ్బంది సమష్టి కృషి వల్లే ఇది సాధ్యమైంది.

– జ్యోత్స్న, రీజియన్‌ మేనేజర్‌

ఫ పండుగ రద్దీ నేపథ్యంలో నల్లగొండ రీజియన్‌కు రూ.35.98 కోట్ల ఆదాయం

ఫ అత్యధికంగా సూర్యాపేట డిపోకు రూ.9.12 కోట్ల రాబడి

రామగిరి(నల్లగొండ), మిర్యాలగూడ టౌన్‌ : బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా టీజీఎస్‌ ఆర్టీసీ నల్లగొండ రీజియన్‌ రికార్డు స్థాయి రాబడి సాధించింది. ఈనెల 9 నుంచి 26వ తేదీ వరకు (18 రోజుల పాటు) రీజియన్‌ వ్యాప్తంగా నడిచిన ప్రత్యేక బస్సుల ద్వారా రూ. 35.98 కోట్ల ఆదాయం సమకూరింది. నల్లగొండ రీజియన్‌ పరిధిలోని యాదగిరిగుట్ట, దేవరకొండ, నార్కట్‌పల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ డిపో పరిధిలో 50.99 లక్షల కిలోమీటర్ల మేర బస్సులను నడిపిన ఆర్టీసీ, 49.34 లక్షల మంది ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చింది. అత్యధికంగా సూర్యాపేట డిపో రూ. 9.12 కోట్లు రాబడితో అగ్రస్థానంలో నిలవగా, నల్లగొండ డిపో రూ. 7.05 కోట్లతో ద్వితీయ స్థానంలో నిలిచింది.

మహాలక్ష్మితో

కిక్కిరిసిన బస్సులు

మహాలక్ష్మి ఉచిత ప్రయాణ పథకానికి మహిళల నుంచి ఊహించని స్పందన లభించింది. రీజియన్‌ వ్యాప్తంగా ప్రయాణించిన మొత్తం 49,34,656 మంది ప్రయాణికుల్లో, 31,18,320 మందికి పైగా మహిళలు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచితంగా ప్రయాణించారు. పండుగ రోజుల్లో రీజియన్‌లోని అన్ని బస్సు సర్వీసులు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.

డిపోల వారీగా సమకూరిన ఆదాయం

డిపో ఆదాయం మొత్తం మహాలక్ష్మి

(కోట్లలో) ప్రయాణికులు ప్రయాణికులు

సూర్యాపేట 9.12 11,11,373 7,56,853

నల్లగొండ 7.05 9,94,115 5,95,536

దేవరకొండ 5 7,08,714 4,49,869

మిర్యాలగూడ 4.91 7,10,136 4,17,786

యాదగిరిగుట్ట 4.41 6,57,957 4,43,063

కోదాడ 4.20 5,26,270 2,91,681

నార్కట్‌పల్లి 1.26 2,26,091 1,63,532

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement