రామన్నపేట: నిరుద్యోగ యువతీ యువకులతోపాటు అన్నివర్గాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, రానున్న పట్టఽభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం రామన్నపేటలో పట్టభద్రుల ఓటు నమోదుపై ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లోని పట్టుభద్రులను గుర్తించి ఓటు నమోదు చేయించాలన్నారు. రాష్ట్రంలో కరువు విలయతాండవం చేయడానికి కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధానాలే కారణమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లు ఎత్తిపోస్తే కేసీఆర్‌కు మంచిపేరు వస్తుందనే కారణంతో సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణను ఎడారిగా మారుస్తున్నారని ఆరోపించారు. యాసంగి సాగు ప్రణాళికను విడుదల చేయాలని, వ్యవసాయానికి ఎన్ని గంటల కరెంటు ఇస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఎల్‌నినోతో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు పోచబోయిన మల్లేశం, బందెల రాములు, వేమవరపు సుధీర్‌బాబు, బొక్క మాధవరెడ్డి, జి.సత్తయ్య, ఎస్‌కే చాంద్, ఎండీ ఆమేర్, జాడ సంతోష్, ఎజాజ్, పులిపలుపుల వీరస్వామి, బండ శ్రీనివాస్‌రెడ్డి, రాస వెంకటేశం, రవ్వ నర్సింహ, మంటి లింగస్వామి, పిట్ట మహేందర్‌రెడ్డి, ఆవుల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
ఫ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య


