బడికి రా చిట్టితల్లీ | - | Sakshi
Sakshi News home page

బడికి రా చిట్టితల్లీ

Oct 29 2026 1:36 AM | Updated on Oct 29 2026 1:36 AM

గట్టుప్పల్‌ : విద్యార్థులకు పాఠాలు చెప్పడమే కాదు.. బడికి దూరమైన పిల్లలను తిరిగి అక్షరాల బాట పట్టించేందుకు ఓ ప్రధానోపాధ్యాయురాలు ప్రయత్నం చేస్తున్నారు. గట్టుప్పల్‌ మండలం, అంతంపేట గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జయప్రద.. తరగతి గదిలో విద్యార్థుల కోసం ఎదురుచూడటమే కాకుండా.. వారు బడికి రాకుంటే ఎక్కడున్నా వెతుక్కుంటూ వెళ్లి బడికి తీసుకొస్తున్నారు. పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న కొమ్ము పూజ, సురిగి స్వామి గత కొన్ని రోజులుగా పాఠశాలకు రాకపోవడాన్ని గమనించి ప్రధానోపా ధ్యాయురాలు జయప్రద ఆందోళన చెందారు. చదువులో చురుగ్గా ఉండే విద్యార్థులు కావడంతో వారిని ఎలాగైనా తిరిగి పాఠశాలకు రప్పించాలని నిర్ణయించుకున్నారు. పలుమార్లు విద్యార్థుల ఇళ్లకు వెళ్లారు. వారు అక్కడ కనిపించపోయినా ప్రయత్నం మాత్రం ఆపలేదు.

ఫ పాఠశాలకు దూరమైన విద్యార్థులను తిరిగి రప్పించే ప్రయత్నం చేస్తున్న హెచ్‌ఎం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement