రామన్నపేట: ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లింది. ఈ సంఘటన రామన్నపేట మండలం బోగారం గ్రామశివారులో బుధవారం చోటుచేసుకుంది. భువనగిరి నుంచి నల్లగొండకు 23మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు బోగారం శివారులోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్‌బంక్ వద్దకు చేరుకోగా.. వెనుక డోర్ వేసుకోకుండా ముందు వెళ్తున్న టిప్పర్లోని పశువుల పేడ పెద్దమొత్తంలో రోడ్డుమీద పడింది. ఈక్రమంలో బస్సు పేడపై నుంచి వెళ్లడంతో చక్రాలు జారి అదుపుతప్పి రోడ్డుకిందికి వెళ్లింది. డ్రైవర్ అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికులు సురక్షింతంగా బయటపడ్డారు.


