అంతర్జాతీయ సహకారం బలోపేతమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ సహకారం బలోపేతమే లక్ష్యం

Oct 27 2026 1:56 AM | Updated on Oct 27 2026 1:56 AM

పెద్దవూర: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బుద్దిస్ట్‌ స్కాలర్స్‌ పరిశోధకులకు అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడమే వరల్డ్‌ బుద్దిస్ట్‌ కూటమి ప్రధాన లక్ష్యమని వరల్డ్‌ బుద్దిస్ట్‌ స్కాలర్స్‌ కూటమి చైర్మన్‌ మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు. 25, 26న శ్రీలంకలోలోని మాతరలో రెండు రోజుల పాటు నిర్వహించిన సదస్సులో వరల్డ్‌ స్కాలర్స్‌ కూటమి చైర్మన్‌గా తనను ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. శ్రీలంక మాతరలోని హత్హేతీయ రాజమహా విహారయాలో ఏకగ్రీవంగా ఆమోదించిన కూటమి ప్రధాన పోషకులుగా అగ్రహారె కన్సవ థేరో, పోషకులుగా డాక్టర్‌ గగన్‌మాలిక్‌, కౌసల్య విక్రమసింగే, కన్వీనర్‌గా ప్రొఫెసర్‌ గామిని రణసింగే, సహ కన్వీనర్లుగా ప్రొఫెసర్‌ సంతోష్‌రౌత్‌, ప్రొఫెసర్‌ మహేష్‌ డియోకర్‌, ప్రముఖ బౌద్ద నిపుణుడు, చరిత్రకారుడు ఈమని శివనాగిరెడ్డి, డాక్టర్‌ డబ్ల్యూ ఎం.టీ.బీ విజేపాలతో పాటు భారత్‌, శ్రీలంక దేశాలకు చెందిన 32 మంది ప్రముఖ బుద్దిస్ట్‌ స్కాలర్స్‌, బౌద్ద నిపుణులు, ప్రతినిధులతో అంతర్జాతీయ కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కూటమి కార్యకలాపాల కోసం శ్రీలంకలోని హత్హేతీయ రాజ మహా విహారయాలో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

వరల్డ్‌ బుద్దిస్ట్‌ స్కాలర్స్‌ కూటమి చైర్మన్‌ మల్లేపల్లి లక్ష్మయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement