పూత లేదు.. పిందె లేదు | - | Sakshi
Sakshi News home page

పూత లేదు.. పిందె లేదు

Oct 27 2026 1:56 AM | Updated on Oct 27 2026 1:56 AM

పూత లేదు.. పిందె లేదు

సాధారణంగా వర్షాకాలంలో అనుకూల వాతావరణం ఉంటే సీతాఫలాల చెట్లకు పుష్కలంగా పూత వచ్చి, ఆపై పిందెలు ఏర్పడతాయి. సెప్టెంబర్‌ నాటికి కాయలు పెరిగి, నెలాఖరు నుంచి మార్కెట్లలోకి వస్తాయి. దసరా నుంచి దీపావళి వరకు అమ్మకాలు జోరుగా సాగుతాయి. అయితే ఈసారి వర్షాలు కురవకపోవడం, తీవ్రమైన ఉష్ణోగ్రతల వల్ల చెట్లకు తగిన తేమ అందలేదు. ఫలితంగా రాచకొండ అటవీ ప్రాంతంలో ఆశించిన స్థాయిలో పూత, పిందెలు లేక చెట్లు బోసిపోయి కనిపిస్తున్నాయి. గతంలో బుట్టల నిండా పండ్లు సేకరించిన చోట, ఇప్పుడు ఒక్క పండు కూడా దొరకక సేకరణదారులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement