బ్రిక్స్‌ సదస్సులో ఇక్కత్‌ ఎగ్జిబిషన్‌ ఏర్పాటుకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

బ్రిక్స్‌ సదస్సులో ఇక్కత్‌ ఎగ్జిబిషన్‌ ఏర్పాటుకు ఎంపిక

Oct 27 2026 1:56 AM | Updated on Oct 27 2026 1:56 AM

భూదాన్‌పోచంపల్లి: న్యూఢిల్లీలోని పార్లమెంట్‌ భవనంలో 12వ బ్రిక్స్‌ (బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, సౌత్‌ ఆఫ్రికా దేశాల కూటమి) పార్లమెంటరీ సదస్సు సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి భూదాన్‌ పోచంపల్లికి చెందిన నిఫ్ట్‌ డిజైనర్‌, యువ వ్యాపారవేత్త తడక వైష్ణవి పార్లమెంట్‌ భవనం ఆవరణలో ఇక్కత్‌ చేనేత వస్త్రాల ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసుకునేందుకు ఎంపికయ్యారు. ఇందులో భాగంగా ఆమె ఆకర్షణీయమైన ఇక్కత్‌ వాస్‌కోట్లు, శాలువాలు, కుర్తాలు, చీరలు, స్టోల్స్‌, దుప్పట్టాలు, హ్యాండ్‌బ్యాగ్స్‌ తదితర ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు. ఇదిలా ఉండగా.. మంగళవారం ప్రధాని మోదీని తడక వైష్ణవి ప్రత్యేకంగా కలిసే అవకాశం ఉంది. గతంలోనూ వైష్ణవి.. లక్‌పతి దీదీ ప్రోగ్రామ్‌, యునైటెడ్‌ యంగ్‌ ఎంటర్‌ప్రిన్యూర్‌గా ఎంపికై పలువురి ప్రశంసలు అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement