అడ్డగూడూరు: విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో ఆయిల్ పామ్ చెట్లు దగ్ధమయ్యాయి. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం అడ్డగూడూరు మండల పరిధిలోని లక్ష్మిదేవికాల్వ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలో నక్క అబ్బయ్య సూరమ్మకు చెందిన ఆయిల్ పామ్ తోటలో నుంచి వెళ్లిన త్రీఫేస్ విద్యుత్ వైర్లు లూజుగా ఉండడంతో ఒక దానికొకటి తగిలి షార్ట్‌సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగాయి. దీంతో ఏడు ఎకరాల ఆయిల్‌పామ్ తోటలోని ఒక ఎకరంలో సుమారుగా 50 ఆయిల్ పామ్ చెట్లు, డ్రిప్ పైపులు పూర్తిగా కాలినట్లు బాధిత రైతు తెలిపాడు. సుమారుగా రూ.10లక్షల నష్టం వాటిల్లినట్లు వాపోయాడు.


