నకిరేకల్ (చిట్యాల): మండలంలోని వెలిమి నేడు గ్రామ పరిధిలో జాతీయ రహదారి పక్కన హోటల్స్, పల్లె ప్రకృతి వనం, ప్రభుత్వ ఆస్పత్రులకు సమీప పరిసరాల్లో నిర్మిస్తున్న రెడిమిక్స్ ప్లాంట్ నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. ఆదివారం వెలిమినేడులో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వాతావరణ కాలుష్యాన్ని పెంచే రెడిమిక్స్ ప్లాంట్‌ను జనవాసాలకు దగ్గరగా ఏర్పాటు చేయటం సరికాదన్నారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ గ్రామ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు అర్రూరీ శ్రీశైలం అధ్యక్షతన నిర్వహించిన ధర్నాలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కల్లూరి మల్లారెడ్డి, నాయకులు కలను వెంకటేష్‌గౌడ్, బొతల రామకృష్ణారెడ్డి, జింకల ప్రభాకర్, నాతి శ్రీనివాస్‌గౌడ్, పైళ్ల రఘుమారెడ్డి, బైకాని నర్సింహ, చిర్రగోని సురేష్, ఏనుగు శ్రీకాంత్‌రెడ్డి, లోడె చిరంజీవి, సూర్యాప్రకాష్‌రెడ్డి, కుమార్, జహంగీర్, మణికంఠ, రవి, సంగప్ప పాల్గొన్నారు.
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య


