మూతపడుతున్న పాల సేకరణ కేంద్రాలు | - | Sakshi
Sakshi News home page

మూతపడుతున్న పాల సేకరణ కేంద్రాలు

Oct 26 2026 2:04 AM | Updated on Oct 26 2026 2:04 AM

ఈ సారి వర్షాలు లేక గడ్డి మొలకెత్తలేదు. దీంతో పశువులకు పోషకాహారం సరిపడా అందక పాల దిగుబడి తగ్గిపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లోని పాల సేకరణ కేంద్రాలు మూతపడుతున్నాయి. సంస్థాన్‌ నారాయణపురం మండలం పుట్టపాక పాల సేకరణ కేంద్రానికి గతేడాది ఇదే సమయంలో రోజుకు 300 లీటర్లకు పైగా పాలు వచ్చేవి. ఈ ఏడాది మార్చి నాటికి 100 లీటర్లకు పడిపోగా, ప్రస్తుతం రోజుకు కేవలం 7 లీటర్ల పాలు మాత్రమే వస్తున్నాయి. అలాగే జనగాం కేంద్రంలో గతంలో 220 లీటర్లు రాగా, గత నెల నాటికి 40 లీటర్లకు పడిపోయింది. ఇటీవల ఇతర గ్రామాల రైతులు తేవడంతో 70 లీటర్లకు చేరింది. పశువులు లేక మేత అందక లచ్చమాగూడెం, అరెగూడెం, కొత్తగూడెం, గుజ్జ గ్రామాల్లో పాల సేకరణ కేంద్రాలు పూర్తిగా మూతపడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement