కట్టంగూర్ : మండలంలోని చెర్వుఅన్నారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఎస్‌జీఎఫ్‌ఐ (స్కూల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్–14, 17 బాలబాలికల హ్యాండ్‌బాల్ పోటీల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా జట్లను ఎంపిక చేశారు. వీరు త్వరలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పాఠశాల హెచ్‌ఎం కందాల రమ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ చిలుముల సైదులు, ఆర్గనైజింగ్ సెక్రటరీ చింతకాయల పుల్లయ్య, కన్వీనర్ శ్రీనివాస్, నంధ్యాల రాజశేఖర్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


