రోడ్డు ప్రమాదంలో విద్యుత్‌ లైన్‌మెన్‌కు తీవ్రగాయాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో విద్యుత్‌ లైన్‌మెన్‌కు తీవ్రగాయాలు

Sep 26 2026 1:44 AM | Updated on Sep 26 2026 1:44 AM

కట్టంగూర్‌ : మండలంలోని ముత్యాలమ్మగూడెం జీపీ పరిధి మాణిక్కాలమ్మగూడెం స్జేజీ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డుప్రమాదంలో విద్యుత్‌ లైన్‌మెన్‌కు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కట్టంగూర్‌కు చెందిన ముక్కాముల వెంకన్న మండలంలోని దుగినవెల్లి గ్రామంలో విద్యుత్‌ లైన్‌మెన్‌ విధులు నిర్వహిస్తున్నాడు. డ్యూటీలో భాగంగా దుగినవెల్లికి వెళ్లి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. మార్గమధ్యంలో మాణిక్కాలమ్మగూడెం స్టేజీ వద్దకు రాగానే హైదరాబాద్‌ నుంచి సూర్యాపేట వైపు వెళ్తున్న కారు అతి వేగంగా వచ్చి వెంకన్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం 108 వాహనంలో నార్కట్‌పల్లి ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. వెంకన్న కోడలు ముక్కాముల స్వాతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవీందర్‌ తెలిపారు.

గుండెపోటుతో

ఫైర్‌ ఆఫీసర్‌ మృతి

వేములవాడరూరల్‌ : వేములవాడ స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ నాగు అనిల్‌కుమార్‌ శుక్రవారం గుండెపోటుతో హైదరాబాద్‌లో మృతిచెందారు. అనిల్‌కుమార్‌ స్వగ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం తుమ్మలగూడెం కాగా.. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. 2008 బ్యాచ్‌కు చెందిన అనిల్‌కుమార్‌ డ్రైవర్‌గా విధుల్లో చేరి స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌గా ఎదిగారు. గత రెండేళ్లుగా వేములవాడ అగ్నిమాపక అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు.

లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం

మిర్యాలగూడ అర్బన్‌ : లారీ ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన మిర్యాలగూడ పట్టణంలోని హనుమాన్‌పేట ఫ్‌లై ఓవర్‌ వద్ద చోటు చేసుకుంది. టూ టౌన్‌ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దామరచర్ల మండలం కేజేఆర్‌ కాలనీకి చెందిన ధనావత్‌ మంగ్తా(61) బ్యాంకులో గోల్డ్‌ లోన్‌ కట్టడానికి గాను తన కుమారుడికి డబ్బులు ఇచ్చేందుకు మిర్యాలగూడకు వచ్చాడు. డబ్బులు ఇచ్చిన అనంతరం హనుమాన్‌పేటలోని టీ స్టాల్‌కు వెళ్లేందుకు యూటర్న్‌ తీసుకుంటుండగా.. సాగర్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న లారీ మంగ్తా వాహనాన్ని ఢీ కొట్టింది. మంగ్తా కిందపడిపోగా అతడి తల పైనుంచి లారీ టైరు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతివేగం, అజాగ్రత్తగా లారీ నడిపిన షేక్‌ ఖాజాను అదుపులోకి తీసుకుని లారీని స్వాధీనం చేసుకున్నామని, మృతుడి కుమారుడు దనావత్‌ కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు టూ టౌన్‌ సీఐ సోమనర్సయ్య తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement