సూర్యాపేట (ఆత్మకూరు.ఎస్): ఆత్మకూరు.ఎస్ మండల పరిధిలోని ముక్కుడు దేవులపల్లి గ్రామానికి చెందిన మందడి వెంకట్‌రెడ్డి ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం సందర్భంగా భారీ ట్రక్కు (టస్కర్) నడిపారు. ఈయన గత 26 సంవత్సరాలుగా విజయవాడకు చెందిన ఎస్టీసీ ట్రాన్స్‌పోర్ట్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. వెంకటరెడ్డి నైపుణ్యాన్ని గుర్తించిన యాజమాన్యం బడా గణేష్ నిమజ్జనం సందర్భంగా లక్షలాది మందిలో టస్కర్ నడిపేందుకు అవకాశం కల్పించారు. దీంతో 2017, 2020, 2025, ప్రస్తుతం 2026 లో కూడా టస్కర్ నడిపే అవకాశం వెంకట్‌రెడ్డికే దక్కింది. ప్రస్తుత గణేష్ శోభాయాత్ర సందర్భంగా లక్షలాది భక్త జనం మధ్యలో ఖైరతాబాద్ నుంచి ట్యాంక్ బండ్ వరకు టస్కర్‌ను ఎలాంటి విఘాతాలు లేకుండా నడిపి వినాయకుడి నిమజ్జనం ప్రశాంతంగా జరగడానికి కృషి చేశారు.
అబ్దుల్ బారి
అంత్యక్రియలు పూర్తి
నల్లగొండ: మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసులో ఏ–ఫోర్ నిందితుడు, కేంద్ర మంత్రి అరుణ్ పాండే హత్య కేసులో నిందితుడు నల్లగొండకు చెందిన అబ్దుల్ బారి అంత్యక్రియలు శుక్రవారం రాత్రి పూర్తయ్యాయి. హైదరాబాదులోని చంచల్‌గూడ జైలులో ఉన్న బారికి గుండెపోటు రావడంతో అధికారులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. శుక్రవారం గాంధీ ఆసుపత్రిలో ఆయన మృతదేహానికి పంచనామా నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. నల్లగొండ పట్టణంలోని అవ్వల్ తాలూక్ దారీ మసీదులో నమాజ్ ఏ జనాజా నిర్వహించారు. అనంతరం మసీదు ఎదురుగా ఉన్న ఖబరస్తాన్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.


