పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలి | - | Sakshi
Sakshi News home page

పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలి

Sep 25 2026 2:35 AM | Updated on Sep 25 2026 2:35 AM

భువనగిరిటౌన్‌ : జిల్లాలో పత్తి కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ భాస్కర్‌ రావు అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ మీటింగ్‌ హాల్‌లో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వెంకారెడ్డి, సంబంధిత శాఖల అధికారులతో కలిసి పత్తి కొనుగోళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పత్తి సాగు, అంచనా దిగుబడి, మద్దతు ధర, కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించారు. ఇన్‌చార్జి కలెక్టర్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పత్తికి క్వింటాకు రూ.8,667 మద్దతు ధర నిర్ణయించిందని, గత సంవత్సరంతో పోలిస్తే రూ.557 పెరిగిందని తెలిపారు. జిల్లాలో ఈ ఏడాది సుమారు 1.12 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరిగిందని, దాదాపు 6.75 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. దీని ద్వారా జిల్లాలోని సుమారు 35 వేల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుందన్నారు. రైతులు తమ పంటను మద్దతు ధరకు అమ్ముకునేందుకు వీలుగా జిల్లాలోని 13 జిన్నింగ్‌ మిల్లులను కొనుగోలు కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో రెవెన్యూ డివిజనల్‌ అధికారి కృష్ణారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి రమణారెడ్డి, మార్కెటింగ్‌ అధికారి సారంగపాణి, సీసీఐ మహబూబ్‌నగర్‌ బ్రాంచ్‌ డిప్యూటీ మేనేజర్‌, పత్తి జిన్నింగ్‌ మిల్లుల అసోసియేషన్‌ ప్రతినిధులు, మార్కెట్‌ కమిటీ కార్యదర్శులు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని

వేగవంతం చేయాలి

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లు, రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ భాస్కర్‌ రావు అధికారులకు సూచించారు. గురువారం కలెక్టర్‌ ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో అర్హులైన గుడిసెదారులందరినీ గుర్తించి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రాధాన్యత క్రమంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలన్నారు. ఇళ్ల మంజూరు, నిధుల విడుదలలో సాంకేతిక సమస్యల పరిష్కారానికి మూడో స్థాయి నుంచి మొదటి స్థాయికి సడలింపు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

ఫ ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ భాస్కర్‌ రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement