మిల్లర్లకు ‘ధాన్యం’ షాక్‌! | - | Sakshi
Sakshi News home page

మిల్లర్లకు ‘ధాన్యం’ షాక్‌!

Sep 25 2026 2:35 AM | Updated on Sep 25 2026 2:35 AM

సాక్షి, యాదాద్రి: ఈ వానాకాలం సీజన్‌లో సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు పంపకుండా నేరుగా ప్రభుత్వ, ప్రైవేట్‌ గోదాముల్లోనే నిల్వ చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లా యంత్రాంగం గోదాముల అన్వేషణను ముమ్మరం చేసింది. జిల్లాలో ఇప్పటికే గత యాసంగికి చెందిన 85 వేల టన్నుల ధాన్యం నిల్వలు ఉన్నాయి. దీనికి తోడు 50 నుంచి 60 వేల టన్నుల మొక్కజొన్న, పత్తి నిల్వలు పేరుకుపోయాయి. వంగపల్లి, బీబీనగర్‌ గోదాముల్లో భారీగా పత్తి నిల్వలు ఉన్నాయి. టెండర్‌ ధాన్యం ఖాళీ చేయడం ద్వారా జిల్లాలో సుమారు 75 వేల నుంచి 80 వేల మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యం మాత్రమే అందుబాటులోకి వస్తుంది. మిగిలిన కనీసం 2 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని భద్రపరిచేందుకు ప్రైవేట్‌ గోదాములను అద్దెకు తీసుకునేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

లోటును భర్తీ చేసుకోవాలని

యోచిస్తున్న మిల్లర్లు

పౌరసరఫరాల శాఖ తాజా నిర్ణయం ప్రకారం ఇప్పటివరకు మిల్లర్లకు ధాన్యం ఇవ్వకూడదని భావిస్తున్నారు. మరోవైపు మిల్లుల్లో ఇప్పటికే ధాన్యం నిల్వ ఉందనే నెపంతో సీఎంఆర్‌, రా రైస్‌ తీసుకోవడానికి ఎఫ్‌సీఐ నుంచి సరైన ప్రోత్సాహం లభించడం లేదని మిల్లర్లు ఆరోపిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి ఇటీవల మిల్లులు మూసివేసిన మిల్లర్లు, ఫిజికల్‌ వెరిఫికేషన్‌ నిబంధనల్లో ప్రభుత్వం కొంత సడలింపు ఇవ్వడంతో మళ్లీ తెరిచారు. ఈ సీజన్‌లో ఎలాగైనా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి తమ లోటును భర్తీ చేసుకోవాలని మిల్లర్లు ఆలోచిస్తున్నారు.

ఫ ఈ సారి మిల్లులకు ధాన్యం ఇవ్వకుండా నేరుగా గోదాముల్లోకే

ఫ జిల్లాలో ప్రైవేట్‌ గోదాముల వేటలో నిమగ్నమైన అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement