మరమ్మతులు మూన్నాళ్ల ముచ్చటే.. | - | Sakshi
Sakshi News home page

మరమ్మతులు మూన్నాళ్ల ముచ్చటే..

Sep 25 2026 2:35 AM | Updated on Sep 25 2026 2:35 AM

మోత్కూరు : మోత్కూరులోని చెరువు కట్ట రహదారి మరమ్మతులు మూన్నాళ్ల ముచ్చటగా మారాయి. గత వర్షకాలంలో మోత్కూరు పెద్ద చెరువు కట్ట రహదారి కుంగిపోయింది. రెండు నెలల క్రితం చెరువు కట్ట మరమ్మతుల పనులను కాంట్రాక్టర్‌ పూర్తి చేశారు. ఈ పనుల కోసం రూ.36 లక్షలు ప్రభుత్వం వెచ్చించింది. 30 మీటర్ల దూరం కుంగిన చెరువు కట్ట రహదారి పనులు పూర్తిచేశారు. అయినా చెరువు కట్టపై ఉన్న రహదారి భారీ వర్షాలకు కోతకు గురై ప్రమాదకరంగా మారింది. దీంతో వాహనదారులు, ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement