దేవరకొండ : అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో విద్యార్థుల ప్రవేశాల సంఖ్యను పెంచాలని నోడల్ అధికారి బి. ధర్మానాయక్ సూచించారు. గురువారం ఆయన దేవరకొండ ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించారు. కళాశాల అధ్యాపకులు, స్టడీ సెంటర్ సిబ్బందితో ఆయన సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చదువుకు దూరమైన వారిని దూరవిద్య ద్వారా మళ్లీ చదువుకు చేరువ చేసేందుకు ప్రతిఒక్క అధ్యాపకుడు కృషిచేయాలన్నారు. దూరవిద్యలో విద్యార్థులకు అందుబాటులో ఉన్న నూతన కోర్సులు, అవకాశాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. వైస్ చాన్స్‌లర్ ఘంటా చక్రపాణి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బలోపేతానికి ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో ప్రిన్సిపాల్ రమావత్ రవి, అధ్యాపకులు పాల్గొన్నారు.
ఫ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ
నోడల్ అధికారి ధర్మానాయక్


