తరంగ్‌–2 పర్వతాన్ని అధిరోహించిన అన్వితారెడ్డి | - | Sakshi
Sakshi News home page

తరంగ్‌–2 పర్వతాన్ని అధిరోహించిన అన్వితారెడ్డి

Sep 25 2026 2:35 AM | Updated on Sep 25 2026 2:35 AM

భువనగిరి : హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని 6,027 మీటర్ల ఎత్తైన తరంగ్‌–2 పర్వతాన్ని 10 మందితో కూడిన బృందం ట్రాన్సెండ్‌ అడ్వెంచర్స్‌ యాత్ర సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 22న అధిరోహించింది. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు నలుగురు ఉండగా.. మిగిలిన ఆరుగురు నార్త్‌ స్టేట్‌లకు చెందిన వారున్నారు. తెలంగాణకు చెందిన వారిలో రాజ్‌కుమార్‌, మోతికుమార్‌(ఖమ్మం), ఫణి(నిజామాబాద్‌), భువనగిరికి చెందిన పడమటి అన్వితారెడ్డి ఉన్నారు. ఈ నెల 10న మనాలీ నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం 22న పర్వతాన్ని అధిరోహించడంతో ముగిసింది. గురువారం తిరిగి మనాలీకి చేరుకున్నారు. ఇప్పటి వరకు ఈ పర్వతానికి చేరుకోవడానికి మార్గం లేకపోవడంతో సాంకేతిక పరిజ్ఞానంతో లాజిస్టిక్స్‌ ఉపయోగిస్తూ పర్వతాన్ని అధిరోహించి ఇండియాలో మొదటిసారిగా ఈ పర్వతానికి కొత్త మార్గాన్ని కనిపెట్టి రికార్డు సృష్టించారు. కాగా ఇప్పటికే పడమటి అన్వితారెడ్డి ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement